ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మార్కెట్లో రిలీఫ్‌ ర్యాలీ

ABN, Publish Date - Jan 16 , 2025 | 05:44 AM

భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సహా పలు ప్రధాన కంపెనీల షేర్లలో కొనుగోళ్లు ఇందుకు...

200 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

ముంబై: భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సహా పలు ప్రధాన కంపెనీల షేర్లలో కొనుగోళ్లు ఇందుకు దోహదపడ్డాయి. ముడిచమురు సెగలు, విదేశీ పెట్టుబడులు ఉపసంహరణ వంటి అంశాలు మాత్రం లాభాలను పరిమితం చేశాయి. బుధవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ ఒకదశలో 491.42 పాయింట్లు ఎగబాకినప్పటికీ, చివరికి 224.45 పాయింట్ల లాభంతో 76,724.08 వద్ద ముగిసింది. నిఫ్టీ 37.15 పాయింట్ల వృద్ధితో 23,213.20 వద్ద స్థిరపడింది. బీఎ్‌సఈ స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ సూచీలు 0.34 శాతం వరకు పెరిగాయి. మంగళవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 169.62 పాయింట్లు, నిఫ్టీ 90.10 పాయింట్లు లాభపడ్డాయి.

  • భారత్‌ కరెన్సీ కూడా వరుసగా రెండో రోజూ బలపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 13 పైసలు పెరిగి రూ.86.40 వద్ద ముగిసింది. మంగళవారం సెషన్‌లోనూ రూపాయి మారకం విలువ 17 పైసలు పెరిగింది.

  • లక్ష్మీ డెంటల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌కు భారీ స్పందన లభించింది. బుధవారంతో ముగిసిన ఈ రూ.698 కోట్ల ఆఫర్‌కు ఏకంగా 113.97 రెట్ల బిడ్లు వచ్చాయి.


వేదాంత రిసోర్సెస్‌ 110 కోట్ల డాలర్ల సమీకరణ: రెండు విడతల బాండ్ల జారీ ద్వారా వేదాంత రిసోర్సెస్‌ 110 కోట్ల డాలర్లు సమీకరించింది. ప్రస్తుత రుణభారాన్ని తగ్గించుకునేందుకు ఈ నిధులను వినియోగించుకోనుంది. 2024 సెప్టెంబరు నుంచి ఇప్పటివరకు బాండ్ల జారీ ద్వారా కంపెనీ 310 కోట్ల డాలర్లు సేకరించింది.

ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్‌ రూ.4,789 కోట్ల సేకరణ: ప్రమోటర్లకు ప్రిఫరెన్షియల్‌ ఇష్యూతో పాటు క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌ (క్యూఐపీ) ద్వారా మొత్తం రూ.4,789 కోట్లు సమీకరించనున్నట్లు ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ లిమిటెడ్‌ (ఏబీఎ్‌ఫఆర్‌ఎల్‌) వెల్లడించింది. వ్యాపార వృద్ధి కోసం ఈ నిధులను వినియోగించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది.

Updated Date - Jan 16 , 2025 | 06:39 AM