ఎఫ్‌పీఐలకు సెబీ ఊరట

ABN, Publish Date - Mar 25 , 2025 | 02:44 AM

సెబీ కొత్త చీఫ్‌ తుహిన్‌ కాంత పాండే కార్యాచరణకు దిగారు. సోమవారం ఆయన అధ్యక్షతన జరిగిన తొలి సమావేశంలోనే సెబీ డైరెక్టర్ల బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఎఫ్‌పీఐల పెట్టుబడుల వెల్లడి...

ఎఫ్‌పీఐలకు సెబీ ఊరట
  • వివరాల వెల్లడి పరిమితి రెట్టింపు

  • రూ.50,000 కోట్లు మించితే మరిన్ని వివరాలు

ముంబై: సెబీ కొత్త చీఫ్‌ తుహిన్‌ కాంత పాండే కార్యాచరణకు దిగారు. సోమవారం ఆయన అధ్యక్షతన జరిగిన తొలి సమావేశంలోనే సెబీ డైరెక్టర్ల బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఎఫ్‌పీఐల పెట్టుబడుల వెల్లడి పరిమితిని రూ.25,000 కోట్ల నుంచి రూ.50,000 కోట్లకు పెంచింది. ఇంకా ఇన్వె్‌స్టమెంట్‌ అడ్వైజర్లు, రీసెర్చి అనలిస్టుల ముందస్తు ఫీజు వసూలు కాలపరిమితిని విస్తరించింది. మారుతున్న మార్కెట్‌ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు సెబీ చీఫ్‌ చెప్పారు.


సెబీ బోర్డు తీసుకున్న కీలక నిర్ణయాలు.

  • ఈక్విటీ మార్కెట్‌లో రూ.50,000 కోట్లకు మించిన పెట్టుబడులున్న ఎఫ్‌పీఐ, తమ అసలు మదుపరులకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించాలి. ఇంతకు ముందు ఈ పరిమితి రూ.25,000 కోట్లు.

  • ఏదైనా ఒక ఎఫ్‌పీఐ తన నిర్వహణలోని ఆస్తుల విలువలో (ఏయూఎం) సగానికి మించి, ఏదైనా ఒక కంపెనీ లేదా పారిశ్రామిక గ్రూపు నిర్వహణలోని కంపెనీల షేర్లలో మదుపు చేసినా మరిన్ని వివరాలు వెల్లడించాలి.

  • ఇన్వె్‌స్టమెంట్‌ అడ్వైజర్లు మదుపరుల నుంచి వసూలు చేసే ముందస్తు ఫీజు కాల పరిమితిని ప్రస్తుత ఆరు నెలల నుంచి ఏడాదికి పెంచారు.

  • రెసెర్చి అనలిస్టులు వసూలు చేసే ముందస్తు ఫీజు కాల పరిమితి కూడా ప్రస్తుత మూడు నెలల నుంచి ఏడాదికి పెంచారు.


  • ఫీజుల పరిమితి, చెల్లింపుల విధానం, రిఫండ్స్‌, బ్రేకేజి ఫీజులు వ్యక్తిగత మదుపరులు, అవిభక్త హిందూ కుటుంబాలకు మాత్రమే వర్తిస్తాయి.

  • కేటగిరి 2కు చెందిన ఆల్టర్‌నేటివ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్స్‌ (ఏఐఎఫ్‌) ‘ఏ’ లేదా అంతకంటే తక్కువ రేటింగ్‌ ఉన్న లిస్టెడ్‌ రుణ పత్రాల్లో మదుపు చేసినా ఇక ఆ పెట్టుబడులను అనిలిస్టెడ్‌ సెక్యూరిటీలుగానే పరిగణిస్తారు.

  • సెబీ బోర్డు సభ్యుల పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశాల వెల్లడిని సమగ్రంగా సమీక్షించేందుకు ఒక ఉన్నతాధికార కమిటీ ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి...

Anchor Shyamala Investigation: బెట్టింగ్ యాప్స్ కేసు.. పోలీసుల ఎదుట యాంకర్ శ్యామల

Social Media: సోషల్ మీడియాతో జర జాగ్రత్త.. ఎక్స్‌ట్రాలు చేశారంటే లోపలేస్తారు..!

Read Latest Business News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 02:44 AM