ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Account Nomination Rules : నామినేషన్ల వ్యవస్థ పునర్‌వ్యవస్థీకరణ

ABN, Publish Date - Jan 11 , 2025 | 03:54 AM

మ్యూచువల్‌ ఫండ్స్‌ (ఎంఎఫ్‌) ఫోలియోలు, డీమ్యాట్‌ ఖాతాల నామినేషన్‌ విధానాన్ని సెబీ పునర్‌ వ్యవస్థీకరించింది.

  • మార్చి 1 నుంచే అమలు: సెబీ

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌ (ఎంఎఫ్‌) ఫోలియోలు, డీమ్యాట్‌ ఖాతాల నామినేషన్‌ విధానాన్ని సెబీ పునర్‌ వ్యవస్థీకరించింది. దీనికి సంబంధించి శుక్రవారం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ సంవత్సరం మార్చి 1 నుంచే ఇవి అమల్లోకి వస్తాయని తెలిపింది. సెక్యూరిటీస్‌ మార్కెట్లో పారదర్శకత పెంచడంతో పాటు క్లెయిమ్‌ చేయని ఆస్తుల తగ్గింపు కోసం సెబీ ఈ చర్య తీసుకుంది. ముఖ్యమైన మార్గదర్శకాలివే..

  • సింగిల్‌ హోల్డింగ్‌ ఖాతాలకు నామినీ తప్పనిసరి

  • జాయింట్‌ ఖాతాల్లోని చనిపోయిన వ్యక్తి ఆస్తులు నామినేషన్‌ లేకపోయినా బతికి ఉన్న మిగతా జాయింట్‌ ఖాతాదారులకు బదిలీ అవుతాయి

  • తన తదనంతరం ఎంఎఫ్‌ ఫోలియోలు, డీమ్యాట్‌ ఖాతాల్లోని తన ఆస్తులు ఎవరికి ఎవరికి ఎంతెంత చెందాలనే విషయం స్పష్టం చేస్తూ ఖాతాదారులు 10 మందిని నామినేట్‌ చేసే అవకాశం

  • ఖాతాదారుడితో పాటు నామినీల్లో ఎవరైనా చనిపోతే ఆస్తులను దామాషా పద్దతిలో మిగతా నామినీలకు పంచుతారు

  • చనిపోయిన వ్యక్తుల వారసుల తరఫున నామినీలు ట్రస్టీలుగా ఆస్తులు పొందేందుకు ఆమోదం.

Updated Date - Jan 11 , 2025 | 03:55 AM