Stock Market Update: ఒడిదుడుకుల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

ABN, Publish Date - Mar 28 , 2025 | 10:45 AM

అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నడుమ తీవ్ర ఒడిదుడుకుల్లో కొనసాగుతోన్న దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు

Stock Market Update: ఒడిదుడుకుల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market Updates: అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతుండటంతో భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఇవాళ (శుక్రవారం) ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. మార్కెట్ ప్రారంభమైనప్పుడు ఫ్లాట్‌గా మొదలైనప్పటికీ కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 10:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 175 పాయింట్లు నష్టంతో 77,431 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ (Nifty) 36 పాయింట్ల నష్టంతో 23,555 వద్ద కదలాడుతున్నాయి. అయితే, అనంతరం ఒక్కసారిగా నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ లు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. నిన్న అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అయితే, ఒక్క యూఎస్ 30 ఇండెక్స్ మాత్రం పాజిటివ్ గా నడుస్తోంది. ఎస్‌అండ్‌పీ సూచీ 0.28 శాతం, డౌజోన్స్‌ 0.37 శాతం నష్టాల్లో ముగిశాయి.


ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు నేడు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నిక్కీ 2.41 శాతం, హాంకాంగ్‌ హాంగెసెంగ్‌ 0.90 శాతం నష్టంతో సాగుతున్నాయి. కాగా, విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) నిన్న (గురువారం) పెద్దఎత్తున కొనుగోళ్లు జరిపారు. నిన్న ఒక్కరోజే భారీగా రూ.11,111 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) కూడా నికరంగా రూ.2,518 కోట్ల షేర్లు కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్ బ్యారెల్‌ 72.54 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 85.59 వద్ద ఉంది.


ఇవి కూడా చదవండి:

భార్యను చంపి.. అత్తామామలకు ఫోన్..

దెబ్బలు పడతాయ్ రాజా.. దెబ్బలు పడతాయ్ రో..

Updated Date - Mar 28 , 2025 | 10:54 AM