Stock Market Opening Bell: మిశ్రమంగా మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

ABN, Publish Date - Apr 04 , 2025 | 09:24 AM

అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ నిన్న భారత మార్కెట్లు తమ దమ్ము చూపించాయి. మొత్తం ప్రపంచ మార్కెట్లన్నీ కుదేలవుతుంటే మన మార్కెట్లు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఇక ఇవాళ(శుక్రవారం) మిశ్రమంగా మార్కెట్లు ఓపెన్ అయ్యాయి.

Stock Market Opening Bell:  మిశ్రమంగా మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
stock market

Stock Market Opening Bell: భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ మిశ్రమంగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెగిటివ్ సంకేతాల నేపథ్యం ఉన్నప్పటికీ మన మార్కెట్లు పెద్దగా స్పందించడం లేదు. మార్కెట్ మొదలైన ఉదయం 9:15 గంటలకు సెన్సెక్స్‌ (Sensex) 135.27 పాయింట్లు.. నిఫ్టీ (Nifty) 59.70 పాయింట్లు నష్టంతో స్టార్ట్ కాగా, బ్యాంక్ నిఫ్టీ 114.25 పాయింట్లు, ఫిన్ నిఫ్టీ 67.20 పాయింట్లు, బ్యాంకెక్స్ 161.14 పాయింట్ల లాభంతో కదలాడుతున్నాయి.అయితే, మార్కెట్ మొదలైన కొద్ది సేపటి నుంచే భారీ స్థాయిలో కిందికి పడుతున్నాయి మార్కెట్ సూచీలు.


ఇవి కూడా చదవండి:

సనోజ్ మిశ్రాపై రేప్ కేసు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన నటి

ఉదయం పరగడుపున ఈ వాటర్ తాగితే ఆరోగ్యం..

Updated Date - Apr 04 , 2025 | 09:32 AM