ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పన్నుల భారం తగ్గించాలి

ABN, Publish Date - Jan 16 , 2025 | 05:48 AM

వచ్చే కేంద్ర బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయ పన్ను (ఐటీ) భారం తగ్గించక తప్పదని ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఇక్రా స్పష్టం చేసింది. ఈ భారం తగ్గితే తప్ప వినియోగ వ్యయం పెరిగి జీడీపీ వృద్ధిరేటు పుంజుకునే అవకాశం లేదని...

ఇక్రా బడ్జెట్‌ విన్నపం

న్యూఢిల్లీ: వచ్చే కేంద్ర బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయ పన్ను (ఐటీ) భారం తగ్గించక తప్పదని ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఇక్రా స్పష్టం చేసింది. ఈ భారం తగ్గితే తప్ప వినియోగ వ్యయం పెరిగి జీడీపీ వృద్ధిరేటు పుంజుకునే అవకాశం లేదని పేర్కొంది. గత సెప్టెంబరు త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు రెండేళ్ల కనిష్ట స్థాయి 5.4 శాతానికి పడిపోయిన నేపథ్యంలో ఇక్రా ఈ హెచ్చరిక చేసింది. వచ్చే కేంద్ర బడ్జెట్‌లో మూలధన పెట్టుబడులు కూడా రూ.11 లక్షల కోట్ల స్థాయిలో ఉండాలని సూచించింది.


రూ.1.4 లక్షల కోట్ల లోటు : ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో కేటాయించిన రూ.11.11 లక్షల కోట్ల మూలధన పెట్టుబడుల్లో రూ.1.4 లక్షల కోట్లు లోటు ఏర్పడే అవకాశం ఉందని ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అది తి నాయర్‌ చెప్పారు. గత ఏడాది ఏప్రిల్‌-నవంబరు మధ్య కాలంలో మొత్తం మూలధన పెట్టుబడుల్లో 46 శాతం (రూ.5.13 లక్షల కోట్లు) మాత్రమే ఖర్చు చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే ఆర్థిక సంవత్సరానికి రుణ సేకరణను నియంత్రిస్తూ మూలధన పెట్టుబడులు రూ.11 లక్షల కోట్ల స్థాయిలో ఉండేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చర్యలు తీసుకోవాలన్నారు.

4.5 శాతం ద్రవ్య లోటు సాధ్యమే : ఆదాయ వృద్ధిరేటును పరిగణనలోకి తీసుకుంటే వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26) ద్రవ్యలోటును జీడీపీలో 4.5 శాతం వద్ద కట్టడి చేయడం పెద్ద కష్టమేమీ కాదని నాయర్‌ స్పష్టం చేశారు. అపుడు మూలధన పెట్టుబడుల కోసం రూ.11 లక్షల కోట్లు కేటాయించడం సాధ్యమవుతుందన్నారు.


దిగుమతులు కట్టడి చేయాలి : ఈవై

పడిపోతున్న రూపాయి మారకం రేటును నిలబెట్టేందుకు వచ్చే కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రముఖ అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ ఈవై సూచించింది. ఇందుకోసం దిగుమతులపై సుంకాలు పెంచాలని కోరింది. ఇలా చేయడం వల్ల డాలర్లకు గిరాకీ తగ్గి, రూపాయి మారకం రేటు కుదు టపడుతుందని తెలిపింది.

పన్నుపోటు తగ్గించండి: క్రెడాయ్‌

అందుబాటు ధరల (అఫర్డబుల్‌) గృహ ప్రాజెక్టులపై ఆదాయ పన్ను 15 శాతానికి కుదించాలని రియల్‌ ఎస్టేట్‌ రంగం కోరింది. అలాగే ఈ తరహా ప్రాజెక్టులు చేపట్టే కంపెనీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరింది. అలాగే అందుబాటు ధరల గృహ నిర్వచనాన్నీ ప్రస్తుతం రూ.45 లక్షల నుంచి మరింత పెంచాలని విజ్ఞప్తి చేసింది.


టూ వీలర్లపై జీఎ్‌సటీ తగ్గించాలి : హీరో మోటోకార్ప్‌

కనీసం 125 సీసీ వరకు సామర్థ్యం ఉన్న ద్విచక్ర వాహనాలపై జీఎస్‌ టీని 28ునుంచి 18ు స్థాయికి కుదించాలని హీరో మోటోకార్ప్‌ కోరింది.

Updated Date - Jan 16 , 2025 | 05:48 AM