Gold Rate: గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..
ABN , Publish Date - Apr 15 , 2025 | 07:00 AM
Today Gold And Silver Rate In Telugu: ఈ రోజు ప్రముఖ నగరాలైన చెన్నై, ముంబై, కోల్‌కతా,బెంగళూరు, కేరళ, పూణెలలో 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర.. 8754గా ఉంది. మిగిలిన నగరాలతో పోల్చుకుంటే ఢిల్లీలో 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర అధికంగా ఉంది.

పసిడి ప్రియులకు ఇది గుడ్‌న్యూస్ అని చెప్పాలి. మూడు రోజుల క్రితం వరకు కస్టమర్లకు చుక్కలు చూపించిన బంగారం ధరలు.. గత రెండు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 87,550 రూపాయలు..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 95,510 రూపాయలు.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 71,640 రూపాయలుగా ఉండింది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాముల బంగారంపై.. గ్రాముకు ఒక రూపాయి చొప్పున 10 రూపాయలు తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 95,500 రూపాయలు.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 87540 రూపాయలు..
10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర .. 71,630 రూపాయలుగా ఉంది. ఈ రోజు ప్రముఖ నగరాలైన చెన్నై, ముంబై, కోల్‌కతా,బెంగళూరు, కేరళ, పూణెలలో 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర.. 8754గా ఉంది. మిగిలిన నగరాలతో పోల్చుకుంటే ఢిల్లీలో 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర అధికంగా ఉంది. అక్కడ ధర 8,769 రూపాయలుగా ఉంది. ఇక, సిల్వర్ ధరల విషయానికి వస్తే.. 1 గ్రాము సిల్వర్ ధర నిన్న 99.90 రూపాయలు ఉండింది. ఈ రోజు స్వల్పంగా తగ్గి.. 99.80 రూపాయలకు చేరింది. కేజి సిల్వర్ ధర నిన్న 99,900గా ఉండింది. ఈ రోజు కేజీపై వందరూపాయలు తగ్గింది. కేజీ ధర 99,800గా ఉంది.
ఇవి కూడా చదవండి
Nalgonda: నీవు లేక నేనుండలేను..
KTR: ఒక్కసారి ఓటేస్తే.. ఐదేళ్ల శిక్షగా మారింది!