వేచి చూసే ధోరణి బెస్ట్‌!

ABN, Publish Date - Apr 07 , 2025 | 04:27 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం ఆటుపోట్లకు లోనయ్యే అవకాశాలున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన టారిఫ్స్‌ అమల్లోకి రావటంతో ప్రపంచ మార్కెట్లు షేక్‌ అవుతున్నాయి. ట్రంప్‌నకు పోటీగా చైనా సహా...

వేచి చూసే ధోరణి బెస్ట్‌!

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం ఆటుపోట్లకు లోనయ్యే అవకాశాలున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన టారిఫ్స్‌ అమల్లోకి రావటంతో ప్రపంచ మార్కెట్లు షేక్‌ అవుతున్నాయి. ట్రంప్‌నకు పోటీగా చైనా సహా మిగిలిన దేశాలు ప్రతీకార సుంకాలను ప్రకటించటంతో అనిశ్చితి పెరిగింది. భారత్‌పై దీని ప్రభావం తక్కువే అయినప్పటికీ నెగటివ్‌ సెంటిమెంట్‌తో సూచీలు పడిపోయే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో మదుపరులు వేచి చూసే ధోరణిలో ఉండటం ఉత్తమం. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకులు, ఫైనాన్స్‌ కంపెనీల షేర్లలో మూమెంటమ్‌ కనిపిస్తోంది.


స్టాక్‌ రికమండేషన్స్‌

అపోలో హాస్పిటల్స్‌: జీవితకాల గరిష్ఠం నుంచి 20 శాతం మేర పతనమైన ఈ షేరు ప్రస్తుతం టర్న్‌ అరౌండ్‌ అయ్యాయి. నిఫ్టీతో పోలిస్తే మెరుగ్గా ట్రేడవుతోంది. గత శుక్రవారం రూ.6,714 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.6,700 శ్రేణిలో పొజిషన్‌ తీసుకుని రూ.6,850/6,900 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే వి షయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.6,660 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

అదానీ పవర్‌: గత ఏడాది జూన్‌ నుంచి వరుసగా పతనమైన ఈ కౌంటర్‌లో ప్రస్తుతం బేస్‌ ఏర్పడుతోంది. రూ.500 స్థాయిలో మద్దతు తీసుకుని కన్సాలిడేట్‌ అవుతున్నాయి. గత వారం చివరి మూడు సెషన్లలో బాగా రాణించాయి. గత శుక్రవారం రూ.532 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.530/520 శ్రేణిలో ప్రవేశించి రూ.590 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.510 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

టొరెంట్‌ ఫార్మా: డొనాల్డ్‌ ట్రంప్‌ దెబ్బకు ఫార్మా రంగంలోని షేర్లు కుదేలవుతున్నప్పటికీ ఈ షేరు మాత్రం అనూహ్యంగా పెరుగుతోంది. నెల రోజుల్లోనే 15 శాతం మేర పెరిగింది. నిఫ్టీతో పోల్చితే మెరుగ్గా రాణిస్తోంది. గత శుక్రవారం రూ.3,286 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.3,260 వద్ద పొజిషన్‌ తీసుకుని రూ.3,400 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.3,220 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.


మాక్స్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌: గత ఏడాది నవంబరు నుంచి డౌన్‌ట్రెండ్‌లో పయనిస్తున్న ఈ షేరు ఈ ఏడాది మార్చి నుంచి పుంజుకుంది. దాదాపు 20 శాతం మేర పెరిగింది. ప్రస్తుతం రూ.1,100 స్థాయిలో బేస్‌ ఏర్పడుతోంది. బెంచ్‌మార్క్‌ సూచీలు ఒడుదొడుకులకు లోనైనప్పటికీ ఈ షేరు మాత్రం రాణిస్తోంది. గత శుక్రవారం రూ.1,165 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,140 శ్రేణిలో పొజిషన్‌ తీసుకుని రూ.1,250/1,300 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,100 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.

ఇండస్‌ టవర్‌: జీవితకాల గరిష్ఠం నుంచి 30 శాతం మేర దిద్దుబాటుకు లోనైన ఈ షేరు ప్రస్తుతం మంచి బేస్‌ ఏర్పరచుకుంటోంది. గత ఏడాది నవంబరు నుంచి డార్వాస్‌ బాక్స్‌ మాదిరిగా చలిస్తున్నాయి. కీలకమైన రూ.320 స్థాయిలో మరోసారి మద్దతు తీసుకుని పుంజుకున్నాయి. గత శుక్రవారం రూ.360 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.350 వద్ద పొజిషన్‌ తీసుకుని రూ.410 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.320 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

- మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

+91 98855 59709

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి:

BSNL: పుంజుకున్న బీఎస్ఎన్ఎల్, కొత్తగా 55 లక్షల మంది కస్టమర్లు..మొత్తం ఎంతంటే..

Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..

Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 07 , 2025 | 04:27 AM