Stock Market: వారెన్ బఫెట్ ముందుచూపు
ABN, Publish Date - Mar 15 , 2025 | 02:08 AM
స్టాక్ మార్కెట్ పెట్టుబడులతో రూ.లక్షల కోట్లు సంపాదించిన అమెరికా కుబేరుడు, ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ ముందే జాగ్రత్త పడ్డారు.

రూ.28.29 లక్షల కోట్ల విలువైన షేర్ల అమ్మకం
అవకాశం కోసం ఎదురు చూపులు
న్యూయార్క్:స్టాక్ మార్కెట్ పెట్టుబడులతో రూ.లక్షల కోట్లు సంపాదించిన అమెరికా కుబేరుడు, ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ ముందే జాగ్రత్త పడ్డారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధికారం చేపడితే స్టాక్ మార్కెట్ కుప్పకూలే ప్రమాదం ఉందని ముందే ఊహించినట్టున్నారు. గత ఏడాది నవంబరులో అమెరికా స్టాక్ మార్కెట్ గరిష్ఠ స్థాయికి చేరగానే తన పోర్టుఫోలియో షేర్లలో చాలా వాటిని అమ్మేసి 32,500 కోట్ల డాలర్ల (సుమారు రూ.28.29 లక్షల కోట్లు) నగదు దగ్గర పెట్టుకున్నారు. ఈ నగదును ఎప్పడు కావాలంటే అపుడు మళ్లీ షేర్లలో మదుపు చేసేందుకు వీలుగా స్వల్పకాలిక ట్రెజరీ బిల్స్, లిక్విడ్ ఆస్తుల్లో మదుపు చేశారు.
అవకాశం కోసం నిరీక్షణ: 2008 ఆర్థిక సంక్షోభానికి ముందూ వారెన్ బఫెట్ ఇలానే జాగ్రత్త పడ్డారు. ప్రధాన కంపెనీల షేర్లు భారీగా పడిపోయిన వెంటనే చౌకగా వాటిని కొని సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు కూడా బఫెట్ అలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నారని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మార్కెట్ పతనంపై ఒక స్పష్టత వచ్చాక బఫెట్ ఈ నగదుని మంచి కంపెనీల షేర్లలోకి మళ్లిస్తారని భావిస్తున్నారు. ట్రంప్ సుంకాల యుద్ధంతో అమెరికాతో పాటు అనేక దేశాలు ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే ప్రమాదం ఉందని బఫెట్ అంచనా. అదే జరిగితే మళ్లీ బఫెట్ పంట పండినట్టే.
Updated Date - Mar 15 , 2025 | 02:08 AM