Eid Ul Fitr: ఈ సంవత్సరంలో స్టాక్ మార్కెట్‌కు ఏయే రోజుల్లో సెలవలంటే..
ABN, Publish Date - Mar 31 , 2025 | 08:47 AM
ఈద్ ఉల్ ఫితర్‌ను పురస్కరించుకుని నేటు స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. ఈ ఏడాది స్టాక్ మార్కెట్‌కు మొత్తం 14 సెలవులు వచ్చాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

నేడు ఈద్-ఉల్-ఫితర్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లకు సెలవు. బాంబే స్టాక్ ఎక్సేంజితో పాటు నేషనల్ స్టాక్ ఎక్సేంజీలో కూడా కార్యాకలపాలకు బ్రేక్ పడింది. ఇక్విటీలు, డెరివేటివ్స్, కరెన్సీ మార్కెట్లు, ఎస్‌ఎల్‌బీ, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ వంటివాటి ట్రేడింగ్ మళ్లీ రేపటి నుంచి ప్రారంభం కానుంది.
సెలవును ఇలా సద్వినియోగం చేసుకోవాలి
తమ వ్యూహాలను సమీక్షించుకునేందుకు ట్రేడర్లకు సెలవులు ఓ గొప్ప అవకాశం. ప్రొర్ట్ పోలియోల పనితీరును జాగ్రత్తగా సమీక్షించి లాభాలను పెంచుకునేందుకు సెలవుల్లోనే అవకాశం దొరకుతుంది. అంతేకాకుండా, సెలవుల్లో కుటుంబసభ్యులతో గడపడం కూడా మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. మరింత ఉత్సాహంగా మరుసటి రోజు పనిలోకి దిగే మూడ్‌ను సెట్ చేస్తుంది.
Stock Prediction: టెక్ వ్యూ : 23,400 వద్ద కన్సాలిడేషన్
ఈ ఏడాదిలో స్టాక్ మార్కెట్లకు మొత్తం 14 సెలవలు ఉన్నాయి. మహాశివరాత్రి, హోలీ సెలవులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో సెలవల షెడ్యూల్ ఏదో కూలంకషంగా తెలుసుకుందాం.
భారత్‌లోని స్టాక్ ఎక్సేంజీలల్లో జాతీయ స్టాక్ ఎక్సేంజ్ అతిపెద్దది. 3.4 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో ప్రపంచంలోనే నెం.1 స్థానంలో ఉంది. ఎన్ఎస్‌ఈలో సోమవారం నుంచి శుక్రవారం వరకూ ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 3.30 వరకూ ట్రేడింగ్ సాగుతుంది. శని, ఆదివారాల్లో మాత్రం కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోతాయి. వారాంతాలతో పాటు జాతీయ, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన రోజుల్లో కూడా ఎన్‌ఎస్‌ఈ కార్యకలాపాలకు సెలవు ప్రకటిస్తారు.
పండుగ / సెలవు పేరు | తేదీ | రోజు |
---|---|---|
మహావీర జయంతి | ఏప్రిల్ 10, 2025 | గురువారం |
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి | ఏప్రిల్ 14, 2025 | సోమవారం |
గుడ్ ఫ్రైడే | ఏప్రిల్ 18, 2025 | శుక్రవారం |
మహారాష్ట్ర దినోత్సవం | మే 1, 2025 | గురువారం |
స్వాతంత్ర్య దినోత్సవం | ఆగస్టు 15, 2025 | శుక్రవారం |
వినాయక చవితి | ఆగస్టు 27, 2025 | బుధవారం |
మహాత్మా గాంధీ జయంతి / దసరా | అక్టోబర్ 2, 2025 | గురువారం |
దీపావళి లక్ష్మి పూజ | అక్టోబర్ 21, 2025 | మంగళవారం |
దీపావళి-బలిప్రతిపద | అక్టోబర్ 22, 2025 | బుధవారం |
ప్రకాశ్ గురుపురబ్ శ్రీ గురు నానక్ దేవ్ | నవంబర్ 5, 2025 | బుధవారం |
క్రిస్మస్ | డిసెంబర్ 25, 2025 | గురువారం |
Updated Date - Mar 31 , 2025 | 08:51 AM