UP Father kills Daughter: పొరుగింటి వారితో వివాదం.. 5 ఏళ్ల కూతురిని పొట్టన పెట్టుకున్న తండ్రి

ABN, Publish Date - Mar 06 , 2025 | 11:33 PM

పొరుగింటి వారితో గొడవపడ్డ ఓ వ్యక్తి వారింటికి వెళ్లినందుకు అభంశుభం తెలియని కన్నకూతురిని దారుణంగా కడతేర్చాడు. యూపీలో ఈ దారుణం వెలుగు చూసింది.

UP Father kills Daughter: పొరుగింటి వారితో వివాదం.. 5 ఏళ్ల కూతురిని పొట్టన పెట్టుకున్న తండ్రి

ఇంటర్నెట్ డెస్క్: యూపీలో తాజాగా షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పొరుగింటి వారిపై ఉన్న కోపాన్ని ఓ తండ్రి కన్నకూతురిపై ప్రదర్శించాడు. అభం శుభం తెలియని ఆ ఐదేళ్ల చిన్నారిని హత్య చేసి శరీరాన్ని నాలుగు ముక్కలుగా చేసి పారేశాడు. సీతాపూర్‌లో ఈ ఘటన జరిగింది. పోలీసులను బురిడీ కొట్టించేందుకు అతడు నాటకమాడినా ప్రయోజనం లేకపోవడంతో నిందితుడు చివరకు కటకటాల పాలయ్యారు.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఫిబ్రవరి 25న ఓ ఐదేళ్ల బాలిక తప్పిపోయినట్టు పోలీసులకు సమాచారం అందింది. బాలిక తండ్రి మోహిత్ మిశ్రా ఈ ఫిర్యాదు చేశాడు. దీంతో, పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. నాలుగు పోలీసుల బృందాలు చిన్నారి కోసం పెద్ద ఎత్తున గాలించడం ప్రారంభించాయి. ఈ క్రమంలో ఇటీవల ఓ రోజున చిన్నారి చేయి వారికి లభించింది. ఆ మరుసటి రోజు మిగతా శరీరభాగాలు లభించాయి. బాలికను ఎవరో దారుణంగా హత్య చేశారని పోలీసులకు స్పష్టంగా తెలిసిపోయింది.


Miss Fire: పోలీసు తుపాకీ మిస్‌ఫైర్‌.. మహిళకు గాయాలు

దీంతో, పోలీసులు బాలిక బంధువులు, తల్లిదండ్రులు, ఇరుగు పొరుగు వారికి ఒక్కొక్కరుగా ప్రశ్నించ సాగారు. ఈ క్రమంలో నిందితుడికి కంగారు పుట్టి తన మొబల్ ఫోన్‌ను భార్యకు అప్పగించి పారిపోయాడు. ఆ తరువాత కొద్ది రోజులకు తిరిగొచ్చాడు. అప్పటికే పోలీసులకు అతడిపై అనుమానం మొదలైంది. దీంతో, అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా కన్న కూతురిని తానే పొట్టనపెట్టుకున్నానని అతడు చివరకు అంగీకరించాడు.


ఈ వార్తను కూడా చదవండి: అయ్యోపాపం ఎంతఘోరం జరిగిందో.. పాదయాత్రగా వెళ్తూ మృత్యు ఒడిలోకి..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మోహిత్‌కు, ఎరుదింట్లో ఉన్న రామూ కుటుంబం ఎంతో కాలంగా స్నేహంగా ఉండేవారు. కానీ ఇటీవల వారి మధ్య విభేదాలు పొడచూపడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇవేమీ తెలియని చిన్నారి మాత్రం ఎప్పటిలాగే రాము ఇంటికి వెళ్లి వస్తుండేది. ఇక ఘటన జరిగిన రోజున బాలిక ఎదురింట్లో ఆడుకుని తిరిగి వస్తూ తండ్రి కంట పడింది. వారి ఇంటికి వెళ్లొద్దని అంతకుముందే తండ్రికి బాలికను హెచ్చరించాడు. అయినా ఆమె వినకపోవడంతో తీవ్ర ఆగ్రహావేశానికి లోనైన చిన్నారిని తన వెంట నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు ఊరిరాడకుండా చేసి చంపి శరీరాన్ని నాలుగు ముక్కలు చేసి సమీపంలోని పొలంలో విసిరేశాడు. ఆ తరువాత తన బిడ్డ కనబడట్లేదంటూ నాటకానికి తెరతీసి చివరకు పోలీసులకు చిక్కాడు.

Read Latest Telugu News and National News

Updated Date - Mar 06 , 2025 | 11:50 PM