ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Doctor Assaults In laws: బెంగళూరులో షాకింగ్ ఘటన.. వృద్ధులపై చేయి చేసుకున్న డాక్టర్ కోడలు..

ABN, Publish Date - Mar 15 , 2025 | 12:55 PM

అత్తమామలపై చేయి చేసుకున్న డాక్టర్ కోడలి వీడియో నెట్టింట వైరల్‌‌గా మారింది. బెంగళూరులో జరిగిన ఈ ఘటనలో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు మహిళ డాక్టర్‌పై కేసు నమోదు చేశారు.

Bengaluru elderly couple assault

ఇంటర్నెట్ డెస్క్: ఆమె స్వయంగా ఓ డాక్టర్.. అత్తమామలకు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయని తెలుసు.. అయినా కూడా కనికరం లేకుండా వారిపై ఇష్టారీతిన చేయి చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా జనాలు షాకైపోతున్నారు. బెంగళూరులో ఇటీవల వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

బెంగళూరు డాక్టర్ ప్రియదర్శినిపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. తమను వేధించిందని, దాడి చేసిందని కోడలిపై జె.నరసింహ్మయ్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మార్చి 10న ఆమె తన కొడుకు, కూతురితో వచ్చి తమ ఇంటికి వచ్చి దుర్భాషలాడిందని, చేయి చేసుకుందని వాపోయారు. తనతో పాటు తన భార్య, కుమారడిపై కూడా రెచ్చిపోయిందని అన్నారు. 2007లో తన కుమారుడి వివాహం జరిగిందని, ఆ తరువాత కోడుకు కోడలు డైవర్స్‌కు అప్లై చేసుకున్నట్టు తెలిపారు.


Harsh Goenka wealth tips: ధనవంతులు కావాలనుందా.. ఈ పారిశ్రామికవేత్త చెప్పిన 6 సూత్రాలను ఫాలో అయితే..

అయితే, అత్తమామలే తనను రెచ్చగొట్టారని ప్రియదర్శిని పేర్కొన్నారు. పిల్లలను ఆర్థికంగా ఎందుకు ఆదుకోవట్లేదని ప్రశ్నించేందుకు భర్త వద్దకు వెళ్లానని ఆమె చెప్పారు. వారి తీరుతో తనకు, తన పిల్లలకు సహనం నశించి ఆవేశంలో ఉన్నప్పుడు వీడియో రికార్డు చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసుల ఇరు వర్గాల ఆరోపణలపై ప్రశించారు.

Woman Missing from Maha kumbh: సోషల్ మీడియాలో తల్లి ఫొటో చూసి షాక్.. పోస్టు పెట్టిన వారిని వాకబు చేస్తే..


ప్రియదర్శిని మామకు 80 ఏళ్ల, హృద్రోగ బాధితుడని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆమె అత్త కూడా ఓసారి క్యాన్సర్ బారిన పడి కోలుకున్నారు. మామను కాలితో తన్ని, తొక్కి అత్త మంగళసూత్రాలు పట్టుకుని ఈడ్చినట్టు తెలిసింది. కోడలి పెట్టే బాధలు పడలేక వారు పదేళ్లుగా వేరే ఉంటున్నట్టు కూడా తెలిపారు. ఈ ఆరోపణలపై ప్రియదర్శిని ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. మరోవైపు, ఘటన తాలూకు వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కుటుంబ కలహాలు హింసాత్మకంగా మారుతుండటంపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.

Injured Monkey treated in Pharmacy: మనుషులను చూసి తెలివి నేర్చిన కోతి.. చేతికి గాయం కావడంతో...

Man Killed over Holi: హోలీ రంగు పూస్తుంటే వద్దన్నాడని.. యువకుడిని లైబ్రరీలోనే దారుణంగా..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 15 , 2025 | 12:55 PM