Viral Video: ఓ కోడలి కల్మషం, కిరాతకం
ABN, Publish Date - Apr 05 , 2025 | 10:31 AM
ఎంత మంది, ఎన్ని విధాలుగా గగ్గోలు పెట్టినా కొందరు కొత్త కోడళ్లు మారడంలేదు. ఎన్నో ఉదంతాలు చూస్తున్నా వారిలో పరివర్తన మచ్చుకైనా రావడం లేదు. పై పెచ్చు అత్యంత నీచాలకి ఒడిగడుతున్నారు.
ప్రస్తుతం కుటుంబాలు ఎలా ఒంటరై పోతున్నాయన్నదానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ ఘటన. తమకు పుట్టిన పిల్లలకు తాత, నాన్నమ్మ అనే ఆప్యాయత, అనురాగాలు లేకుండా చేస్తున్నారు కొందరు కోడళ్లు.వృద్ధాప్యంలో ఉన్న అత్తా, మామను ఆదరించి చూసుకోవాల్సింది పోయి, వాళ్లని ఓల్డేజ్ హోమ్స్ లకు గెంటేయాలని చూస్తున్నారు. దీంతో ఒకరికొకరు తోడుగా లేకుండా ఒంటరి జీవితాలు గడపాల్సిన దుస్థితిలు ఎదురవుతున్నాయి నేటి కుటుంబ వ్యవస్థలో.
ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్‌లో తాజాగా చోటుచేసుకుంది. అయితే, ఈ దారుణానికి సంబంధించిన దృశ్యాలన్నీ సీసీటీవీల్లో రికార్డు కావడంతో ఇప్పుడు ఈ ఘటన వైరల్ గా మారింది. తన అత్తని వృద్ధాశ్రమానికి పంపనందుకు కోపంగా ఉన్న ఒక కోడలు.. అత్తగారిని చిత్రహింస పెట్టింది. జుట్టు పట్టుకుని ఈడ్చి, ఈడ్చి కొట్టింది. ఆమె తల్లిదండ్రుల ఇంటి నుండి వ్యక్తులను పిలిపించిమరీ.. తన భర్తను కూడా కొట్టించింది. అది ఆ మహాతల్లి చేసిన ఘనకార్యం.
ఇవి కూడా చదవండి
Missing Case: సికింద్రాబాద్‌లో మిస్టరీగా ఒకే కుటుంబంలో ఆరుగురి అదృశ్యం..
Earthquake: పలు దేశాల్లో కంపిస్తోన్న భూమాత.. క్షణ క్షణం.. భయం భయం
Read Latest AP News And Telugu News
Updated Date - Apr 05 , 2025 | 10:53 AM