ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

డబ్బు చుట్టూ ప్రతీకార జ్వాల

ABN, Publish Date - Jan 12 , 2025 | 11:12 AM

రాజకీయ నాయకులకు, బడా పారిశ్రామికవేత్తలకు ఒక్కోసారి కొన్ని అవసరాలు వస్తుంటాయి. వాళ్ళ చేతికి మట్టి అంటకుండా ఆ పనులు జరిగిపోవాలి. పనులు చేయడానికి వాళ్ళదైన అనుచరవర్గమో, గూండా వర్గమో ఉన్నప్పటికీ, వారిపై ఎవరి తాలూకా అన్న ముద్ర ఒకటి ఉంటుంది.

రాజకీయ నాయకులకు, బడా పారిశ్రామికవేత్తలకు ఒక్కోసారి కొన్ని అవసరాలు వస్తుంటాయి. వాళ్ళ చేతికి మట్టి అంటకుండా ఆ పనులు జరిగిపోవాలి. పనులు చేయడానికి వాళ్ళదైన అనుచరవర్గమో, గూండా వర్గమో ఉన్నప్పటికీ, వారిపై ఎవరి తాలూకా అన్న ముద్ర ఒకటి ఉంటుంది. టైమ్‌ బాగోలేక ఏమాత్రం ప్లాన్‌ బెడిసికొట్టినా... సదరు రౌడీలు, గూండాల వెనుక ఉన్న శక్తుల పేర్లు బయటికొస్తాయి. అందుకే కొన్నిసార్లు కొన్ని పనులు చేయడానికి ఎలాంటి ముద్రలు లేనివాళ్ళు అవసరం పడుతుంటారు. అలాంటివారినే తమ తప్పుడు పనులకు వాడుకుంటారు.


తిరువనంతపురానికి చెందిన రమ అనే బిజినెస్‌ ఉమెన్‌కి, ‘అనీ’ అనే ఆమె గూండా అనుచరుడికి ఒకసారి అలాంటి అవసరమే వస్తుంది. తమిళనాడులోని మధురైకి దగ్గరలో ఒక పాడుబడిన ఫ్యాక్టరీలో ఉన్న 30 కోట్ల రూపాయల్ని అపహరించి వాళ్ళకు చేర్చగల వాళ్ళు, ప్రాణాలకు విలువ ఇవ్వని మనుషులు కావాల్సి వస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే అప్పగించిన పనిచేసే క్రమంలో వారిలో ఎవరైనా చనిపోయినా... ఆ చావులకి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే అచ్చంగా ఒక ఆవారా బ్యాచ్‌ అవసరం పడుతుంది.


ఎలాంటి పనీ పాటా లేకుండా అల్లరి చిల్లరిగా తిరిగే ఆనందు, మను, మునాఫ్‌, షాజి ప్రాణస్నేహితులు. ఏదైనా ఒక పెద్దపని చేసి జీవితంలో సెటిల్‌ అవాలనుకుంటారు. ఈ క్రమంలో రిస్క్‌ అయినప్పటికీ ‘అనీ’ అనుచర వర్గంలో కొత్తగా చేరతారు. మధురై నుంచి డబ్బు తెచ్చే పనిని అనీ చలాకీగా ఉన్న ఈ నలుగురికి అప్పగిస్తాడు. మధురైలోని ఇంకో ఇద్దరితో కలిసి వాళ్ళ ప్రాణాలకు తెగించి డబ్బుని సేఫ్‌గా రమ దగ్గరకు చేరుస్తారు. డబ్బు చేర్చిన తర్వాత తమకు ఇవ్వాల్సిన కమీషన్‌ విషయంలో రమకు, ఆనందు వర్గానికి మధ్య బేధాభిప్రాయాలు వస్తాయి. ఇక ఏ పిచ్చి పనీ చేయకుండా జీవితంలో స్థిరపడిపోతామని, ఆరుగురికి తలా ఒక యాభై లక్షలు ఇమ్మని ఆనందు, తలా ఒక పాతిక లక్షలు ఇస్తామని రమ పట్టుబట్టి కూర్చుంటారు. ఈ క్రమంలో రమ కుమారుడికి, షాజీకి మధ్య మాటామాటా పెరిగి కొట్టుకుంటారు. అనీ ఇద్దరికి సర్దిచెప్పి డబ్బు గురించి మాట్లాడుకోడానికి మర్నాడు ఉదయం రమ్మని వాళ్ళకు చెప్పి పంపిస్తాడు.


మర్నాడు దారిలో తమకు ఎదురైన రమ కుమారుడిని నలుగురూ కలసి చితగ్గొట్టి కాలు, చెయ్యి విరిచేస్తారు. అనీ దగ్గరకు బండిమీద బయలుదేరిన మను, మునాఫ్‌ ట్రక్కు ఢీకొని చనిపోతారు. తర్వాత అనీ ఆనందుకి వాళ్లు అడిగిన మూడు కోట్లు ఇచ్చి చనిపోయిన వాళ్ళ కుటుంబానికి కూడా డబ్బు ఇవ్వమని చెబుతాడు. డబ్బుల బ్యాగు తీసుకుని బయలుదేరిన ఆనందు, షాజీని కూడా అనీ అనుచరులు వెంబడించి షాజీని చంపేస్తారు. తన ప్రాణేస్నహితుల చావులకి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు ఆనందు. అతను ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు, చివరికి ఏమయ్యాడనేది మిగిలిన కథ.


ఈజీ మనీ ఎప్పుడూ ఒంటరిగా రాదు. అది తనతో పాటు అనేక సమస్యల్ని, కొన్నిసార్లు మృత్యువునీ కూడా వెంటబెట్టుకుని వస్తుంది. ఈజీ మనీ కోసం వెంపర్లాడే వాళ్ళకి ఈ సినిమా ఒక గుణపాఠం లాంటిది. రాజకీయ నాయకులు, బిజినెస్‌మెన్‌లు తమ అవసరాల కోసం అమాయకుల్ని ఎలా పావులుగా వాడుకుని, అవసరం తీరిన తర్వాత ఎలా విసిరేస్తారనే దానికి ‘ముర’ (వరుస క్రమం) చక్కటి ఉదాహరణ. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవలసింది సూరజ్‌ వింజరమూడు, హృదుహారూన్‌ల నటన గురించి. ‘వికృతి’, ‘ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌’తో మొదలుపెట్టి ‘ముకుందన్‌ ఉన్ని అసోసియేట్స్‌’ నిన్నమొన్నటి ‘గుర్‌’ వరకూ సూరజ్‌ నటనలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే అది అసలు నటనలా ఉండక పోవడం.


అతని ఆహార్యం కానీ, డైలాగ్‌ డెలివరీ కానీ సహజంగా పాత్రోచితంగా ఉండడం. తర్వాత చెప్పుకోవాల్సింది ఆనందుగా నటించిన హృదుహారూన్‌ గురించి. ‘ఆల్‌ ఉయ్‌ ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌’ లో నటించిన హృదుహారూన్‌ ‘ముర’లోని పాత్రని సమర్థవంతంగా పోషించాడు. ‘గాళ్స్‌ విల్‌ బి గాళ్స్‌’, ‘ఆల్‌ ఉయ్‌ ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌’ సినిమాల్లో చక్కటి ప్రతిభ కనబరిచిన కని కుస్రుతిని ఈ సినిమాలో సరిగా ఉపయోగించుకోలేకపోయారని అనిపిస్తుంది. సినిమా మొదటి నుంచి చివరిదాకా మహ్మద్‌ ముస్తఫా దర్శకత్వ ప్రతిభ అడుగడుగునా కనిపిస్తూనే ఉంటుంది. సహజంగా ఉండే మలయాళం సినిమాలను అభిమానించేవారు తప్పకుండా చూడాల్సిన ఉత్కంఠ కలిగించే సినిమా ‘ముర’.

- జి. లక్ష్మి, 94907 35322

Updated Date - Jan 12 , 2025 | 11:12 AM