Share News

ఈ వారంలో ఆ రాశి వారి కృషి ఫలిస్తుంది..

ABN , Publish Date - Feb 09 , 2025 | 07:58 AM

కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఆశావహదృక్పథంతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. మీ కృషిత్వరలో ఫలిస్తుంది. ఆత్యీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖు లను చేస్తాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆహ్వానం అందుకుంటారు.

ఈ వారంలో ఆ రాశి వారి కృషి ఫలిస్తుంది..

అనుగ్రహం

9 - 15 ఫిబ్రవరి 2025

- పి.ప్రసూనా రామన్‌

మేషం

అశ్విని, భరణి,

కృత్తిక 1వ పాదం

కార్యసిద్థికి ఓర్పుతో శ్రమిం చండి. సాయం అర్థించవద్దు. ఖర్చులు విప రీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. పిల్లల చదువులపై దృష్టిపెట్టండి. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆహ్వానం అందు కుంటారు. పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. పాత పరిచయస్తులతో సంభాషిస్తారు. పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.


వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి,

మృగశిర 1,2 పాదాలు

వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. మీ శ్రమ ఫలిస్తుంది. దుబారా ఖర్చులు విపరీతం. తరుచూ ఆత్మీయులతో సంభాషి స్తారు. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. పెద్దల ఆశీస్సులు అందుకుంటారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. పనులు అనుకున్న విధంగా సాగవు. ఒత్తిడికి గురికాకుండా మెల గండి. బుధవారం నాడు నగదు, ఆభరణాలు జాగ్రత్త. శుభకార్యానికి హాజరవుతారు.


మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర,

పునర్వసు 1,2,3 పాదాలు

సంకల్పం సిద్ధిస్తుంది. ధన యోగం, వాహనసౌఖ్యం ఉన్నాయి. రుణ విముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొత్త పనులు చేపడతారు. గృహంలో ప్రశాంతంగా ఉంటుంది. సోమవారం నాడు అనవసర జోక్యం తగదు. కీలకపత్రాలు అందుకుంటారు. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. పిల్లల దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది.


కర్కాటకం

పునర్వసు 4వ

పాదం, పుష్యమి, ఆశ్లేష

కొత్త పనులు మొదలెడతారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. స్వయం కృషితో లక్ష్యాన్ని సాధిస్తారు. ఖర్చులు అంచ నాలను మించుతాయి. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మీ వ్యాఖ్యలు అపా ర్థాలకు దారితీస్తాయి. పెద్దల చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. గురువారం నాడు ఊహించని సంఘటనలు ఎదురవు తాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగి స్తుంది. పిల్లల చదువులపై దృష్టిసారిస్తారు.


సింహం

మఖ, పుబ్బ,

ఉత్తర 1వ పాదం

పరిస్థితులు చక్కబడతాయి. మాట నిలబెట్టుకుంటారు. గౌరవప్రతిష్టలు పెంపొందుతాయి. రావలసిన ధనం అందు తుంది. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ఫోన్‌ సందేశాలు పట్టించు కోవద్దు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. వివాహయత్నం ఫలిస్తుంది. మీ అభిప్రాయా లను పెద్దల ద్వారా తెలియజేయండి. నోటీసులు అందుకుంటారు. కార్యక్రమాలు ముందుకు సాగవు. వేడుకలో పాల్గొంటారు.


కన్య

ఉత్తర 2,3,4; హస్త,

చిత్త 1,2 పాదాలు

తలపెట్టిన కార్యం నెరవేరే వరకు శ్రమించండి. అపజయాలకు కుంగి పోవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆక స్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఆపత్స మయంలో ఆప్తులు ఆదుకుంటారు. మంగళ వారం నాడు పనులు, బాధ్యతలు అప్పగించ వద్దు. అందరితో మితంగా సంభాషించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది.


తుల

చిత్త 3,4; స్వాతి,

విశాఖ 1,2,3 పాదాలు

శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. దూరపు బంధుత్వాలు బలపడ తాయి. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పనులు, కారక్రమాలు సాగవు. నోటీసులు అందుకుంటారు. అయినవారితో సంప్రదిం పులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయా లకు విలువ ఇవ్వండి. పెద్దల చొరవతో సమస్య పరిష్కారమవుతుంది. నిర్దిష్ట ఆలోచ నలతో ముందుకు సాగుతారు. కనిపించ కుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి.


వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ

అవిశ్రాంతంగా శ్రమిస్తారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆదాయం బాగుంటుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. సోమ, మంగళ వారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. బంధుత్వాలు బలపడతాయి. పత్రాల రెన్యువల్‌లో జాప్యం తగదు.


ధనుస్సు

మూల, పూర్వాషాఢ,

ఉత్తరాషాఢ 1వ పాదం

ఈ వారం యోగదాయకం. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. అవకా శాలు కలిసివస్తాయి. ఆర్భాటాలకు విపరీ తంగా వ్యయం చేస్తారు. కష్టమనుకున్న పనులు సానుకూలమవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఇంటి విషయాలపై దృష్టిపెడతారు. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. సమయాను కూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.


మకరం

ఉత్తరాషాఢ 2,3,4;

శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు

కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఆశావహదృక్పథంతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. మీ కృషిత్వరలో ఫలిస్తుంది. ఆత్యీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖు లను చేస్తాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆహ్వానం అందుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. పిల్లల చదువులపై మరింత శ్రద్ధ వహించండి.


కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

ఏకాగ్రతతో శ్రమించండి. ఇతరులను తప్పుపట్టవద్దు. మీ తప్పిదాలను సరిదిద్దుకోవడం ముఖ్యం. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. బుధవారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. ఆత్మీయు లతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. అవకాశా లను తక్షణం అందిపుచ్చుకోండి. అను మానాలు, అపోహలకు తావివ్వవద్దు. పత్రాల రెన్యువల్‌లో ఏకాగ్రత వహించండి.


మీనం

పూర్వాభాద్ర 4వ

పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

లక్ష్యసాధనకు సంకల్పబలం ముఖ్యం. అనుమానాలు, అపోహలకు తావి వ్వవద్దు. ధైర్యంగా అడుగు ముందుకేయండి. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తి చేస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుం టాయి. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచి స్తారు. శుక్రవారం నాడు కొత్తవ్యక్తులతో జాగ్రత్త. ధనప్రలోభాలకు లొంగవద్దు. మిమ్ము లను మోసగించేందుకు కొందరు యత్నిస్తారు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి.

Updated Date - Feb 09 , 2025 | 08:02 AM