ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శుభ‘ఆకాంక్షలు’

ABN, Publish Date - Jan 01 , 2025 | 05:42 AM

కొత్త సీసాలో పాత సారాను పోసేసుకునీ సంబరాలను అంబరంగా జరిపేసుకునీ క్యాలెండర్లో తారీఖును చింపేసుకునీ మొఖానికి నవ్వుల్ని పూసేసుకునీ...

కొత్త సీసాలో పాత సారాను

పోసేసుకునీ

సంబరాలను అంబరంగా

జరిపేసుకునీ

క్యాలెండర్లో తారీఖును

చింపేసుకునీ

మొఖానికి నవ్వుల్ని

పూసేసుకునీ

అదే నూతనత్వం అంటే

నేన్నమ్మను కాక నమ్మను

కల్మషాలను కడిగేసుకొని

కళ్లల్లో కాంతులు పోగేసుకుని

గతాన్ని నెమరేసుకొని

బాధల్తో తడుస్తున్న

వర్తమానాన్ని మానాన్ని

ఓ కొత్త వలువతో చుట్టుకోవాలి

భవిష్యత్తును అందంగా

ముస్తాబు చేసుకోవాలి...

సమతను పెంచి మమతను పంచి

ఈ నూతన వత్సరాన

కొత్తగా.. కొంగ్రొత్తగా..

అభ్యుదయ భావాల చిగుళ్ళు

తోడుక్కోవాలి

ఉషస్సులా.. తపస్సులా..

నూతనత్వం వెల్లివిరియాలి..!

కటుకోఝ్వల రమేష్

Updated Date - Jan 01 , 2025 | 05:42 AM