ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mario De Andrade : నా ఆత్మ ఆత్రం

ABN, Publish Date - Jan 13 , 2025 | 05:47 AM

నా వయస్సు లెక్కిస్తే అర్థమయింది ఇంతవరకూ నేను బ్రతికున్నదానికంటే బ్రతకడానికి నాకు తక్కువ సమయం ఉందని ఆగామికంటే గతమే నాకు ఎక్కువని

నా వయస్సు లెక్కిస్తే అర్థమయింది

ఇంతవరకూ నేను బ్రతికున్నదానికంటే

బ్రతకడానికి నాకు తక్కువ సమయం ఉందని

ఆగామికంటే గతమే నాకు ఎక్కువని

ఆ చెర్రీ పండ్ల కలశంతో ఉన్న అబ్బాయిలా ఉంటుంది నాకు

ముందు ఆవురావురుమని వాటిని తిన్నాడు, కానీ

మిగిలినవి తక్కువేనని తెలిసాక, ముమ్మరంగా ఆవేశంగా రుచి చూసాడు.

సామాన్యమైన వాటితో వ్యవహరించే సమయం ఇంక నాకు లేదు

రగిలే అహంకార కవాతులు చేసే సభలలో నేను ఉండదలుచుకోలేదు

సమర్థుల్ని అపఖ్యాతి పాలుచేస్తూ, వారి స్థానాలు పీఠాలు ప్రతిభ ప్రగతి అదృష్టం లాక్కోవాలని ఆశపడే అసూయపరులతో విసిగిపోయాను.

అప్రస్తుతం, నాకు పనికిరాని ఇతరుల జీవితాల విషయ చర్చలు,

అంతులేని సంభాషణలకు, నిజంగానే నాకు సమయం లేదు

కాలక్రమానుగత వయస్సున్నా అపరిపక్వులైన జనం సున్నితత్వాన్ని ముందుకు నడిపించడానికి లేదా నియంత్రించడానికి నాకు ఎక్కువ సమయం లేదు

కేవలం అధికార పత్రాలు తప్ప, విషయాన్ని చర్చించని వారిని, అధికారం కోసం పెనుగులాడేవారిని ఎదుర్కోవడం, నేను ద్వేషిస్తాను. అధికార పత్రాల్ని చర్చించడానికి నా దగ్గర అతితక్కువ సమయం ఉంది. ఈ ప్రపంచంలోని ఆంతరిక సారాంశాన్ని, నేను ఇప్పుడు అర్థం చేసుకోగలను.

నా ఆత్మ ఆత్రంలో ఉంది

నా కలశంలో ఎక్కువ చెర్రీలు లేవు

వారి బలహీనతల మీద వారే నవ్వుకునే వారికి,

మానవీయులకు దగ్గరగా ఉండాలనుకుంటాను,

స్వయంతృప్తులు, వారి విజయాలపై అతిగా ఊహించే వారికి దూరంగా, స్వీయ ప్రాముఖ్యతలతో నిండి ఉన్నవారికీ దూరంగా

అత్యవసరాలే జీవితాన్ని విలువైనదిగా చేస్తాయి

కావలసినదానికంటే అత్యవసరాలే నాకు ఎక్కువ

అవును, నేను తొందరలో ఉన్నాను

పరిపూర్ణతనిచ్చే తీవ్ర ఆవేశంతో బ్రతకడానికి, నేను తొందరపడుతున్నాను

మిగిలిన చెర్రీలను నేను వ్యర్థం చేసుకోవాలనుకోవడం లేదు

అవి ప్రశస్తమైనవని నాకు ఖచ్చితంగా తెలుసు,

ఇంత వరకూ తిన్న వాటికంటే కూడా.

కన్‌ఫ్యూసియస్ చెప్పినట్టు ‘‘మనకు రెండు జీవితాలు. రెండవది మొదలయ్యేది, ఒక్కటే మిగిలుందని గ్రహింపుకు వచ్చినపుడు’’

-బ్రెజిల్ కవి

-మారియో డె అండ్రాడే (1893–1945)

అనువాదం

-ముకుంద రామారావు

- 99083 47273

Updated Date - Jan 13 , 2025 | 05:51 AM