Health Impact of Sleep on Floor: నేలపై నిద్రిస్తే కలిగే ఇబ్బందులు ఇవే
ABN , Publish Date - Apr 14 , 2025 | 10:35 PM
నేలపై నిద్రిస్తే కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

అనేక మందికి నేలపై నిద్రించడమే ఇష్టం. సింపుల్ జీవితాన్ని గడపడంలో భాగంగా కొందరు ఇలా నేలపై నిద్రిస్తుంటారు. మరికొందరు ఇది మంచి అలవాటని భావిస్తారు. తరతరాలుగా భారతీయులు అనుసరిస్తున్న విధానం ఇది. అయితే, నేలపై నిద్రిస్తే కొన్ని సమస్యలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నిద్రలో నాణ్యత తగ్గడంతో పాటు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు (Health Impact of Sleep on Floor).
నేలపై నిద్రిస్తే అలర్జీల బారిన పడే అవకాశం ఉంది. నేలపై ఉండే దుమ్ము, ఫంగస్ కారణంగా ఈ అలర్జీలు తలెత్తొచ్చు. శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు, దగ్గులు, తుమ్ములు, కళ్లు ఎర్రబడటం, దురదపెట్టడం వంటి ఇబ్బందుల పాల పడొచ్చు.
వెన్నెముకకు సహసిద్ధంగా కొన్ని వంపులు ఉంటాయి. నేలపై నిద్రించినప్పుడు వెన్నెముక సహజ ఆకృతిలో ఉండక ఒత్తిడి పెరుగుతుంది. ఇది అసౌకర్యాన్ని కలిగించి చివరకు వెన్ను నొప్పి మొదలయ్యే అవకాశం పెరుగుతుంది
వయసు పెరిగే కొద్దీ శరీరంలో కదలికలు తగ్గిపోతాయి. దీంతో, వయసు మళ్లిన వారికి నేలపై నుంచి లేవడం కష్టంగా మారుతుంది. ఇలాంటి సందర్భాల్లో కింద పడి దెబ్బలు తిగిలే సమస్య కూడా వస్తుంది.
నేల మీద నుంచి లేచి కూర్చొనేటప్పుడు మోకాళ్లపై, తుంటిపై ఒత్తిడి పెరుగుతుంది. ఇతరత్రా సమస్యలు ఎక్కువయ్యేలా చేస్తుంది.
సాధారణంగా నేల మీద చల్లగా ఉంటుంది. చల్లటి గాలి నేలకు సమీపంలో ఉండటమే ఇందుకు కారణం. ఎండాకాలంలో ఇది అద్భుతంగానే ఉన్నా చలి కాలంలో మాత్రం ఇబ్బందుల పాలు అయ్యేలా చేస్తుంది. ఆస్తమా వంటి సమస్యలు ఎక్కువవుతాయి.
నేల మీద నిద్రించినప్పుడు బరువు కారణంగా శరీరం నేలకు అదిమిపెట్టినట్టు అవుతుంది. దీంతో, కొన్ని ప్రదేశాలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. మొద్దు బారినట్టు అవడమే కాకుండా ఇతరత్రా అసౌకర్యాలు తీవ్రమయ్యే అవకాశాలు కూడా పెరుగుతాయి.
ఇలా నేల మీద నిద్రించడంతో వచ్చే రకరకాల అసౌకర్యాల కారణంగా నిద్ర చెడిపోతుంది. కలత నిద్ర కారణంగా మరుసటి ఉదయం ఉత్సాహంగా ప్రారంభించలేరు. దీర్ఘకాలంలో ఇది ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతుంది. కాబట్టి, ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని నేలపై నిద్ర విషయంలో కాస్తంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి:
కిడ్నీ సమస్యలున్న వాళ్లు టమాటాలు ఎందుకు తినొద్దంటే..
మధ్యాహ్నం నిద్రతో ఆరోగ్యానికి చేటు కలుగుతుందా?
జుట్టు ఆరోగ్యం కోసం ఈ విటమిన్స్ తప్పనిసరి!