Bangladesh slams Tulsi Gabbard: అవన్నీ నిరాధార ఆరోపణలు.. అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ వ్యాఖ్యలను ఖండించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం
ABN , Publish Date - Mar 18 , 2025 | 12:08 PM
బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై హింసను ఎదుర్కొంటున్నారంటూ అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసీ గాబార్డ్ చేసిన ఆరోపణలను బాంగ్లాదేశ్ ఆపద్ధర్మ ప్రభుత్వం తోసి పుచ్చింది. అవన్నీ నిరాధార ఆరోపణలని పేర్కొంది.

ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌లో మైనారిటీల వేధింపులు, హత్యలు జరుగుతున్నాయంటూ అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ శాఖ డైరెక్టర్ తులసీ గాబ్బార్డ్ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చసింది. ఈ వ్యాఖ్యలు తప్పుదారి పట్టించేవిగా బ్లాంగ్లాదేశ్ పరపతి దెబ్బతిసేవిగా ఉన్నాయని మొహమ్మద్ యూనిస్ ఖాన్ నేతృత్వంలోని ఆపద్ధర్మ ప్రభుత్వ ప్రతినిధి కామెంట్ చేశారు. బంగ్లాదేశ్ ఎల్లప్పుడూ సమ్మిళిత, శాంతియుత ఇస్లామిక్ విధానాలు అవలంబించిందని పేర్కొన్నారు. అతివాదం ఉగ్రవాదానికి ముకుతాడు వేయడంలో ఎంతో పురోగతి సాధించిందన్నారు. ఉగ్రవాదంపై పోరులో అమెరికాతో పాటు ఇతర అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి ఎంతో చేసిందని తెలిపారు. బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ మత రాజ్య బావజాల ప్రభావం కనిపిస్తోందన్న తులసీ గబ్బార్డ్ వ్యాఖ్యలపై కూడా అక్కడి ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. శాంతి స్థాపనకు, సుస్థిరత్వం, అభివృద్ధి కోసం ప్రజలు పడుతున్న కష్టాలకు ఈ వ్యాఖ్యలు ఇబ్బందికలుగ జేస్తాయని పేర్కొంది.
Also Read: హమాస్‌పై మళ్లీ వైమానిక దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్
అందరినీ ఒకేగాట కట్టే ఆలోచనా ధోరణికి రాజకీయనాయకులు దూరంగా ఉండాలని ప్రభుత్వ ప్రతినిధి వ్యాఖ్యానించారు. ఆధారాల్లేని ఆరోపణలతో వర్గ వైషమ్యాలు పెరుగుతాయని అన్నారు. తమ సార్వభౌమత్వాన్ని , భద్రతను కాపాడుకుంటూనే ఉగ్రవాదానికి ముకుతాడు వేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని బాంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రతినిధి పేర్కొన్నారు.
భారత పర్యటనలో భాగంగా ఇక్కడి జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి తులసీ గాబార్డ్ బంగ్లాదేశ్ పరిస్థితులపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్‌కు చావు తప్పదు.. విశ్లేషకుల అంచనా
బంగ్లాదేశ్‌లోని హిందువులు, బౌద్ధులు, క్రిస్టియన్లు వేధింపులు ఎదుర్కొంటున్నారని, మతోన్మాద మూకల చేతిలో హత్య గురవుతున్నారని పేర్కొన్నారు. ట్రంప్ ప్రభుత్వానికి ఇది ఆందోళన కలిగించే పరిణామాలని వ్యాఖ్యానించారు. ఇస్లామిక్ అతివాద భావజాలం మూలాలు ఈ దాడుల్లో కనిపిస్తున్నాయని అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం బాంగ్లాదేశ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అంతర్జాతీయంగా బంగ్లాదేశ్ పేరు ప్రఖ్యాతులు దెబ్బతినే పరిస్థితి నెలకొనడంతో అక్కడి ప్రభుత్వానికి ఈ కామెంట్స్‌పై స్పందించక తప్పలేదు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి