Share News

Earthquake: ఆ దేశంలో భూకంపం.. ఢిల్లీలో కంపించిన భూమి

ABN , Publish Date - Apr 16 , 2025 | 07:38 AM

నేడు బుధవారం దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. భయంతో ఒక్క క్షణం అక్కడి ప్రజల గుండె ఆగిపోయింది. అందుకు కారణం.. బుధవారం ఉదయం అక్కడ సంభవించిన భూప్రకంపనలు. అసలేం జరిగిందంటే..

Earthquake: ఆ దేశంలో భూకంపం.. ఢిల్లీలో కంపించిన భూమి
Earthquake

ఢిల్లీ: కొన్నిరోజుల క్రితం మయన్మార్, థాయ్‌లాండ్‌లో వచ్చిన భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చిది. వందలామంది చనిపోయారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. అయితే ఆ తర్వాత నుంచి ప్రతి రోజు ప్రపంవ్యాప్తంగా ఏదో ఒక దేశంలో భూమి కంపిస్తూనే ఉంది. మన దేశంలో కూడా ఈ ప్రభావం ఉంది. కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఈశాన్య ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నేడు దేశరాజధాని భూప్రకంపనలతో భీతిల్లింది. పొరుగు దేశంలో వచ్చిన భూకంప ధాటికి.. రాజధాని ఢిల్లీలో స్వల్పంగా భూమి కంపించింది. ఆ వివరాలు..


అఫ్ఘనిస్తాన్‌లో భూకంపం..

పొరుగు దేశం అఫ్ఘనిస్తాన్‌లో నేడు బుధవారం భూకంపం సంభవించింది. హిందూకుష్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున భూకంపం వచ్చినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. దీని తీవ్రత రిక్టార్ స్కేల్ మీద 5.9గా నమోదైనట్లు తెలిసింది. అఫ్ఘనిస్థాన్‌కు 121 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్‌ మెడిటేరియన్‌ సిస్మాలజీ సెంటర్‌ తెలిపింది. ముందుగా ఈ భూకంప తీవ్రతను 6.9 మ్యాగ్నిట్యుడ్‌గా వెల్లడించారు. అయితే ఆ తర్వాత దాన్ని సరి చేసి.. 5.9 మ్యాగ్నిట్యుడ్‌గా నమోదు చేశారు. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని తెలిపారు. అయితే అఫ్ఘనిస్తాన్‌లో భూకంపం వస్తే.. ఆ ప్రభావం మన దేశ రాజధాని ఢిల్లీ మీద పడింది.


ఢిల్లీలో భూప్రకంపనలు..

అఫ్ఘనిస్తాన్‌లో వచ్చిన భూకంపం కారణంగా మన దేశంలో ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు.. జాతీయ భూకంపం కేంద్రం వెల్లడించింది. ఢిల్లీలో భూప్రకంపనల నేపథ్యంలో సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. ఢిల్లీ, పరిసర ప్రాంత ప్రజలు తాము ఉండే ఏరియాల్లో భూమి స్వల్పంగా కంపించిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భూకంపం వచ్చిందా ఏంటి అని ప్రశ్నించారు.

Earthquake

ఇవి కూడా చదవండి:

Ranya Rao Gold Smuggling Case: బళ్లారి నగల వ్యాపారి బెయిలు తిరస్కరణ

Supreme Court: కట్నం కేసులపై పార్లమెంటే చట్టం చేయాలి

Updated Date - Apr 16 , 2025 | 07:40 AM