India-US Relations : అమెరికా నుంచి మరో 487 మంది!

ABN, Publish Date - Feb 08 , 2025 | 05:29 AM

అమెరికా నుంచి మరో 487 మందిని వెనక్కి పంపించనున్నారని, తరలింపుపై వారికి తుది ఉత్తర్వులు జారీ చేశారని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ మేరకు అమెరికా అధికారులు సమాచారం ఇచ్చినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ శుక్రవారం తెలిపారు

India-US Relations : అమెరికా నుంచి మరో 487 మంది!

తరలింపుపై వారికి తుది ఉత్తర్వులు జారీ..కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి మిస్రీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: అమెరికా నుంచి మరో 487 మందిని వెనక్కి పంపించనున్నారని, తరలింపుపై వారికి తుది ఉత్తర్వులు జారీ చేశారని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ మేరకు అమెరికా అధికారులు సమాచారం ఇచ్చినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ శుక్రవారం తెలిపారు. వారిలో 298 మంది వివరాలను తమకు అందజేసినట్లు చెప్పారు. అమెరికా న్యాయ శాఖ నిబంధనల మేరకు అక్కడి అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. అక్రమ వలసదారుల సంఖ్యపై తమకు సమాచారం అందించారని తెలిపారు. తొలివిడతలో 104 మంది భారతీయ అక్రమ వలసదారుల కాళ్లు, చేతులకు సంకెళ్లు వేసి సైనిక విమానంలో తరలించడంపై రాజకీయ దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విదేశాంగ శాఖ కార్యదర్శి ఈ ప్రకటన చేయడం గమనార్హం. అమెరికా ప్రస్తుతం చేపట్టిన వలసదారుల తరలింపు ప్రక్రియ గతంలో కంటే భిన్నమైదనదని మిస్రీ పేర్కొన్నారు. ఈ తరలింపును అమెరికా తన ‘జాతీయ భద్రతా ఆపరేషన్‌’గా అభివర్ణించిందని తెలిపారు. అయితే భారతీయుల పట్ల దురుసుగా ప్రవర్తించరాదని అమెరికాకు స్పష్టం చేసినట్లు చెప్పారు. ఈ విషయంలో అమెరికా అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. మరింత మంది అక్రమ వలసదారులతో కూడిన విమానం త్వరలోనే భారత్‌కు రానుందని తెలిపారు.

Updated Date - Feb 08 , 2025 | 05:29 AM