Indonesia Earthquake: ఇండోనేషియాలో భూకంపం.. భయాందోళనతో పరుగులు పెట్టిన స్థానికులు
ABN , Publish Date - Feb 26 , 2025 | 11:50 AM
ఇండోనేషియాలో బుధవారం రెక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. సులవేసీ ద్వీపానికి కొంత దూరంలో సముద్రగర్భంలో భూకంప కేంద్రం ఉన్నట్టు స్థానిక ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఆస్తి, ప్రాణ నష్టం ఏదీ జరగలేదని వెల్లడించింది.

ఇండోనేషియాలో బుధవారం ఉదయం సంభవించిన భూకంపంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ఏం జరుగుతోందో అర్థంకాక ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంప తీవ్ర రెక్టర్ స్కేలుపై 6.1గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. సులవేసీ ద్వీప తీరానికి కొంత దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని పేర్కొంది. అయితే, దీని తీవ్రత కేవలం 6.0 అని ఇండోనేషియా మెటియోరోలాజికల్ సంస్థ పేర్కొంది. సునామీ ఆందోళన అవసరం లేదని వెల్లడించింది (Indonesia Earthquake).
DOGE Employees Resign: మస్క్‌పై గుస్సా.. 21 మంది డోజ్ శాఖ ఉద్యోగుల రాజీనామా
ఒక్కసారిగా భూమి కంపించడంతో తొలుత తమకు ఏం జరుగుతోందో అర్థంకాక కంగారు పడిపోయాని స్థానికులు తెలిపారు. కాళ్ల కింద భూమి కదలుతుండగా తనకు మెళకువ వచ్చిందని మరో వ్యక్తి పేర్కొన్నారు. తన హోటల్ గదిలోని వస్తువులు అన్నీ కదులుతుండటం చూసి కంగారుగా భయటకు వచ్చేశానని వెల్లడించారు. హోటల్‌లో ఉంటున్న వారందరూ ప్రాణాలు అరచేత పట్టుకుని బయటకు పరుగులు తీశారని పేర్కొన్నారు. ఆ తరువాత కూడా పలుమార్లు భూమి కంపించిందని వెల్లడించారు. అయితే, ఈసారి ఆస్తి, ప్రాణనష్టం ఏమీ సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Donald Trump: భారత్‌కు ట్రంప్ ఝలక్
భూఫలకాలు నిత్యం ఢీకొనే ప్రాంతంలో ఉన్న కారణంగా ఇండోనేషియాలో భూకంపాలు తరచూ సంభిస్తుంటాయి. ఈ ప్రాంతానికి శాస్త్రవేత్తలు రింగ్ ఆఫ్ ఫైర్‌గా పిలుస్తుంటారు. ఇక్కడ అనేక అగ్ని పర్వాతాలు కూడా ఉండటం ఇందుకు కారణం. ఇక 2021లో సులవేసీలో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం 100 మందిని బలితీసుకుంది. అనేక ఇళ్లు కూలిపోవడంతో వేల మంది నిరాశ్రయులుగా మారారు. సులవేసీలో 2018లో 7.1 తీవ్రతతో సంభవించిన మరో భూకంపం కారణంగా ఏకంగా 2200 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మానవ సమాజం ఎన్నటికీ మర్చిపొలేని 2004 నాటి భూకంపం ఏకంగా సునామీకి దారి తీసిన విషయం తెలిసందే. అసీ ప్రావిన్స్‌లో 7.1 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం, తదనంతర సునామీ ఏకంగా 1.7 లక్షల మందిని బలితీసుకున్నాయి.
Read More Latest and International News