Microsoft Employee Vania: మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ వల్లే గాజాలో మారణహోమం
ABN , Publish Date - Apr 08 , 2025 | 05:52 AM
మైక్రోసాఫ్ట్ ఉద్యోగి వనియా అగర్వాల్ గాజాలో మారణహోమానికి కారణమైన సాంకేతికతపై నిరసన తెలిపారు. ఇజ్రాయెల్‌కు సాయం చేయడం సిగ్గుచేటుగా, గాజాలో పన్నెండు వేలమంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు

ఇజ్రాయెల్‌కు సాయం సిగ్గుచేటు.. భారతీయ ఉద్యోగిని నిరసన
వాషింగ్టన్, ఏప్రిల్ 7: మైక్రోసాఫ్ట్ అర్ధశత వార్షికోత్సవ కార్యక్రమంలో వనియా అగర్వాల్ అనే భారతీయ సంతతికి చెందిన ఆ కంపెనీ ఉద్యోగిని పాలస్తీనాకు అనుకూలంగా నిరసన తెలిపారు. ‘సిగ్గుచేటు’ అంటూ తీవ్ర స్వరం వినిపించారు. ‘మీరు సంకుచిత మనుషులు. ఇజ్రాయెల్‌కు మైక్రోసాఫ్ట్ అందించిన సాంకేతికత కారణంగానే గాజాలో యాభై వేలమంది హతమయ్యారు. వాళ్ల రక్తంలో పండగ చేసుకోవడానికిఎంత ధైర్యం? మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నాను’’ అని అన్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సమక్షంలో వాషింగ్టన్‌లోని రెడ్‌మాండ్‌లో గత వారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సమయంలో కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల, మాజీ సీఈవో స్టీవ్ బాల్మేర్ వేదికపైనే ఉన్నారు. అక్కడ నుంచి బయటకురావడంతోనే, సంస్థను వీడుతున్నట్టు వనియా ప్రకటించారు. వనియా మైక్రోసా్‌ఫ్టలో 2023లో చేరారు. ప్రస్తుతం ఆ సంస్థ ఏఐ విభాగంలో ఇంజనీరుగా పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ సైన్యం గడిచిన నెల రోజుల వ్యవధిలో గాజాలో సగ భాగాన్ని అదుపులోకి తెచ్చుకుంది. దాదాపు 3కిలోమీటర్ల మేర గాజా భూభాగంలోకి చొచ్చుకుపోయింది.