Donald Trump: ట్రంప్, మోదీ సంయుక్త ప్రకటన.. పాక్‌కు షాక్!

ABN, Publish Date - Feb 14 , 2025 | 08:57 PM

సీమాంతర ఉగ్రవాదానికి పాక్ స్థావరం కాకూడదంటూ మోదీ ట్రంప్ సంయుక్త ప్రకటన చేయడం దాయాది దేశానికి షాకిచ్చింది. ఉగ్రవాదం కట్టడిలో తమ త్యాగాలను గుర్తించలేదంటూ పాక్ విదేశాంగ శాఖ మంత్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Donald Trump: ట్రంప్, మోదీ సంయుక్త ప్రకటన.. పాక్‌కు షాక్!

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విడుదల చేసిన సంయుక్త ప్రకటన పాక్‌కు గట్టిషాకిచ్చింది. తనను బోనులో నిలబెట్టడం జీర్ణించుకోలేకపోయిన దాయాది దేశం ఎప్పటిలాగే విమర్శలు గుప్పించింది. శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భారత ప్రధాని మోదీ భేటీ అయిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా పలు విషయాలపై ఇరు దేశాధినేతలు చర్చించారు. అనంతరం, ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలో పాక్ దుర్నీతిని ఇరు దేశాలు ఎండగట్టాయి. సీమాంతర ఉగ్రవాద కార్యకలాపాలకు పాక్ స్థావరం కాకూడదంటూ ఇరు దేశాధినేతలు పేర్కొన్నారు (Donald Trump).


Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కి థాంక్స్ చెప్పిన ప్రధాని మోదీ.. కారణం ఇదే

అంతేకాకుండా, అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్, జైషే మహ్మద్, లష్కరే తయ్యబా వంటి ఉగ్రవాద సంస్థల పేర్లు కూడా ఈ సంయుక్త ప్రకటనలో ప్రస్తావనకు వచ్చాయి. అణ్వాయుధాల వ్యాప్తిని నిరోధించాలని, ఉగ్రవాదుల చేతుల్లోకి మారణాయుధాలు చేరకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కూడా ఇరు దేశాలు నిర్ణయించాయి.

ఈ ప్రకటన తప్పుదారి పట్టించేదిగా ఉందని పాక్ ఈ సందర్భంగా వ్యా్ఖ్యానించింది. ఇది ఏకపక్ష ఆరోపణ అని, దౌత్యసంప్రదాయానికి విరుద్ధమని కామెంట్ చేసింది. ఉగ్రవాద కట్టడి కోసం తాము చేసిన త్యాగాలు గుర్తించకుండా ఇలాంటి ప్రకటన చేయడం ఆశ్చర్యపరిచిందని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి షాఫ్‌ఖత్ అలీ ఖాన్ పేర్కొన్నారు.


Elon Musk Son Controls Trump : వామ్మో.. ఎంత మాటనేశాడు.. ట్రంప్‌ పరువు తీసిన మస్క్ కొడుకు..

ముంబై 26/11 దాడుల కేసులో నిందితుడిగా ఉన్న తహావ్వుర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు డొనాల్డ్ ట్రంప్ అంగీకారం తెలిపారు. ‘‘అతడు ప్రపంచంలోని దారుణ వ్యక్తుల్లో ఒకడు. భారత్‌‌లో విచారణ ఎదుర్కోక తప్పదు’’ అని ట్రంప్ పేర్కొన్నారు. పాక్ సంతతికి చెందిన తహావుర్ రాణా ప్రస్తుతం లాస్ ఏంజిలిస్‌లోని జైల్లో ఉన్నాడు.

ఇక తహావుర్‌ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా అంగీకరించడంపై ప్రధాని మోదీ ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపారు. సీమాంతర ఉగ్రవాదానికి చెక్ పెట్టేందుకు సమిష్టి కార్యాచరణ అవసరమని అన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 14 , 2025 | 08:59 PM