China Highway: రోడ్డును ఇలా కూడా నిర్మిస్తారా.. వావ్ వాటెన్ ఐడీయా

ABN, Publish Date - Jan 27 , 2025 | 11:31 AM

China Highway: పంటలకు ఎలాంటి నష్టం కలగకుండా.. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రోడ్డును నిర్మాణానికి శ్రీకారం చుట్టారు అక్కడి అధికారులు. పంట పొలాల పైనుంచి ఆరు లైన్ల రోడ్డును నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ రోడ్డు కోసం పొలాలకు నష్టం చేకూర్చలేదు అక్కడి ప్రభుత్వం. పైగా సరికొత్త ఐడియాతో ఆ పంట పొలాల పైనుంచే హైవే నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు.

China Highway: రోడ్డును ఇలా కూడా నిర్మిస్తారా.. వావ్ వాటెన్ ఐడీయా
China Road

సాధారణంగా రోడ్డు విస్తరణ చేయాలంటే అక్కడ ఉన్న నిర్మాణాలు తొలగించడం వంటి చర్యలు తీసుకుంటారు. తొలగించిన నిర్మాణ యజమానులకు కొంత నష్టపరిహారం ఇచ్చి అక్కడి కట్టడాలను కూల్చివేసి రోడ్డును నిర్మిస్తుంటారు. అలాగే ఊర్లలో రోడ్ల విషయానికి వస్తే.. పంటల పొలాల గుండా రోడ్డు వేయాలంటే ఆ ప్రాంతంలో ఉండే పొలాలను చదును చేసి మరీ రోడ్డును నిర్మిస్తుంటారు. దీంతో రోడ్డు విస్తరణ కోసం పచ్చని పంట పొలాలను తీసివేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే రోడ్డు వేస్తేనే ఊరు అభివృద్ధి చెందుతుందని అనేది వాస్తవం. కానీ రోడ్డు విస్తరణకు అక్కడి ప్రజలు చాలానే పోగొట్టుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే రోడ్డు గురించి తెలిస్తే వావ్ అనకుండా ఉండలేరు. ఓ ప్రాంతంలో పొలాలు అలాగే ఉంచి మరీ రోడ్డు వేశారు అక్కడి అధికారులు. పంట పొలాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్డు వేయడం గురించి ప్రతీఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ రోడ్డు ఎక్కడ ఉంది. రోడ్డు నిర్మాణానికి అక్కడి అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో ఇక్కడ చూద్దాం.


చైనా.. ఈ దేశం గురించి ఎంత చెప్పినా తక్కువేనని చెప్పుకోవచ్చు. కొత్త కొత్త వస్తువులు, పరికరాలు, గేమ్స్ ఇలా ఎన్నో న్యూ ఐడియాలజీలు తీసుకొస్తుంటారు అక్కడి ప్రజలు. ఎన్నో కొత్త కొత్త నిర్మాణాలను కూడా చేస్తుంటారు. అలాంటి వాటిలో పంట పొలాలపై రోడ్డు కూడా ఒకటి. పంటలకు ఎలాంటి నష్టం కలగకుండా.. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు అక్కడి అధికారులు. పంట పొలాల పైనుంచి ఆరు లైన్ల రోడ్డును నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ రోడ్డు కోసం పొలాలకు నష్టం చేకూర్చలేదు అక్కడి ప్రభుత్వం. పైగా సరికొత్త ఐడియాతో ఆ పంట పొలాల పైనుంచే హైవే నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. హుబే ప్రావిన్స్‌లో ఈ సరికొత్త హైవే నిర్మాణం రూపుదిద్దుకుంటోంది. దాదాపు 126 కిలో మీటర్ల పొడవున హైవే నిర్మాణం సాగుతోంది.


ఈ హైవే పేరు వుహాన్‌- యాంగ్‌షీన్‌. పంట పొలాలు, చేపల చెరువుల మీదుగా ఈ హైవే నిర్మాణం కొనసాగుతోంది. ఇది చూడటానికి కూడా ఎంతో అందంగా ఉంది. పంటలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా పెద్ద ఎత్తున్న స్తంభాలను ఏర్పాటు చేసి మరీ హైవేను నిర్మిస్తున్నారు అక్కడి అధికారులు. ఈ సరికొత్త హైవే నిర్మాణాన్ని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యచకితులవుతున్నారు. వావ్ వాటే ఐడీయా అని అనకుండా ఉండలేకపోతున్నారు. ఇలా చేస్తే పచ్చని పంట పొలాలకు నష్టం జరగకపోవడంతో పాటు రోడ్డు నిర్మాణం జరగడంతో ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి.


కాగా.. భారత్‌లో కూడా ఇటీవల కాలంలో అనేక నిర్మాణాలు జరిగాయి. ఎన్నో రోడ్డు, రైల్వే, టెన్నెల్ నిర్మాణాలు చేస్తూ ప్రజలకు ప్రయాణ దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది మోడీ ప్రభుత్వం. తాజాగా జమ్మూ-కశ్మీర్‌లో 6.5 కిలోమీటర్ల పొడవు ఉండే జడ్-మోడ్ సొరంగం ప్రారంభమైంది. అలాగే సెమీ-హై-స్పీడ్, ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్‌తో వందే భారత్ రైలును కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది ప్రభుత్వం. వీటితో పాటు మనాలి, లేహ్‌ల మధ్య దూరాన్ని 46 కిలోమీటర్ల మేర తగ్గించే ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే టన్నెల్ అటల్ టన్నెల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. వీటి ద్వారా సుదూర ప్రయాణాన్ని కూడా తక్కువ సమయంలో చేరుకునే వెసులుబాటు ఉంటుంది.


ఇవి కూడా చదవండి...

సాయంత్రం 4 గంటలకు ఎండీకి సమ్మె నోటీసు..

అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా!

Read Latest International News And Telugu News

Updated Date - Jan 27 , 2025 | 12:11 PM