దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్ అరెస్టు
ABN, Publish Date - Jan 16 , 2025 | 06:30 AM
దక్షిణ కొరియాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాటకీయ పరిణామాల నడుమ అభిశంసనకు గురైన అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను దక్షిణ కొరియా పోలీసులు అరెస్టు చేశారు.
సియోల్, జనవరి 15: దక్షిణ కొరియాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాటకీయ పరిణామాల నడుమ అభిశంసనకు గురైన అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను దక్షిణ కొరియా పోలీసులు అరెస్టు చేశారు. దేశంలో ‘మార్ష ల్ లా’ విధించి చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను యూ న్‌ను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, బుధవారం తెల్లవారుజామున దాదాపు 3వేల మంది పోలీసులు, అవినీతి నిరోధకశాఖ అధికారులు యూన్ నివాసానికి చేరుకున్నారు.
యూన్‌ను అరెస్టు చేసేందుకు వెళ్లిన వీరిని ఆయన మద్దతుదారులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. తీవ్ర ఉద్రిక్తతల నడుమ అధికారులు అధ్యక్ష నివాసంలోకి వెళ్లి యూన్‌ను అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఓసారి యూన్‌ను అరెస్టు చేసేందుకు అధికారులు ప్రయత్నించగా తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో వెనక్కు తగ్గారు. ఇక దక్షిణ కొరియా చరిత్రలో అధ్యక్షుడు అరెస్టవడం ఇదే తొలిసారి.
Updated Date - Jan 16 , 2025 | 06:30 AM