Trump Praise for Modi: మోదీ గొప్ప ప్రధాని
ABN , Publish Date - Mar 30 , 2025 | 04:33 AM
ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రశంసలు కురిపించారు. మోదీని గొప్ప మిత్రుడు, చాలా తెలివైన వ్యక్తి అని పేర్కొన్న ట్రంప్ భారత్‌పై అధిక సుంకాలు విధించడాన్ని సమర్థించారు

చాలా తెలివైన వ్యక్తి.. నా మంచి మిత్రుడు
సుంకాల ఉద్రిక్తతల వేళ ట్రంప్ ప్రశంసలు
వాషింగ్టన్, మార్చి 29: ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రశంసలు కురిపించారు. మోదీని గొప్ప మిత్రుడు, చాలా తెలివైన వ్యక్తి అంటూ శుక్రవారం వైట్‌హౌ్‌సలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ట్రంప్ కొనియాడారు. అయితే, భారత్‌పై అధిక సుంకాలు విధించడాన్ని ట్రంప్ సమర్థించుకున్నారు. ‘మోదీ ఇటీవల ఇక్కడికి వచ్చారు. మేం ఎప్పటి నుంచో మంచి మిత్రులం. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. వారు చాలా తెలివైనవారు. మోదీ నాకు గొప్ప మిత్రుడు. ఆయన చాలా తెలివైన వ్యక్తి. మా మధ్య చాలా మంచి చర్చ జరిగింది. అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందని భావిస్తున్నా’ అన్నారు. కాగా, భారత్ సహా అనేక దేశాలపై అమెరికా విధించిన ప్రతీకార సుంకాలు ఏప్రిల్ 2 నుంచి అమలు కానున్నాయి. అలాగే, అమెరికాకు దిగుమతి చేసుకునే ప్రతి వాహనంపైనా 25 శాతం సుంకాలు విధించాలని గురువారం ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఇది కూడా ఏప్రిల్ 2 నుంచి అమలు కానుంది. కాగా, యూఎ్‌సఎయిడ్‌కు అంతర్జాతీయంగా ఉన్న కార్యాలయాలను మూసివేయనున్నట్టు ట్రంప్ యంత్రాంగం అమెరికా కాంగ్రెస్‌కు తెలిపింది. భూకంపం ధాటికి కుదేలైన మయన్మార్‌కు ట్రంప్ సాయం ప్రకటించిన సమయంలోనే, ఆయన యంత్రాంగం ఈ ప్రకటన చేయడం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu: ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం..
Minister Ramanaidu: ఏపీని ధ్వంసం చేశారు.. జగన్‌పై మంత్రి రామానాయుడు ఫైర్
Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. కొత్త తరహా మోసం
For More AP News and Telugu News
Updated Date - Mar 30 , 2025 | 04:28 AM