Share News

Donald Trumph: గట్టిగా నిలవండి, చారిత్రక ఫలితాలు చూస్తాం: డొనాల్డ్ ట్రంప్

ABN , Publish Date - Apr 05 , 2025 | 08:03 PM

ప్రస్తుత పరిణామాలు ఎంతో కాలం ఉండవని, గతంలో ఎన్నడూ లేనంతగా ఉద్యోగాలు, వ్యాపారాలు వెనక్కి తెస్తామని తన ట్రూత్ సోషల్ ఫ్లాట్‌ఫాంలో ట్రంప్ పేర్కొన్నారు. ఇదొక ఆర్థిక విప్లవమని, మనం తప్పనిసరిగా గెలుస్తున్నామని అన్నారు.

Donald Trumph: గట్టిగా నిలవండి, చారిత్రక ఫలితాలు చూస్తాం: డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trumph) టారిఫ్‌ దెబ్బకు ప్రపంచ దేశాలతో పాటు అమెరికా మార్కెట్లు కూడా కుదేలవుతున్నాయి. దేశ జీడీపీ తగ్గుతుందని, ఉద్యోగాలు ఉండవని జేపీ మోర్గాన్ అంచనా వేసింది. ఆర్థిక మాంధ్యం తప్పకపోవచ్చనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు రోజుల్లోనే అమెరికా మార్కెట్ విలువ 5 ట్రిలియన్ డాలర్ల మేరకు తగ్గిపోయిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే ట్రంప్ తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. ''గట్టిగా నిలవండి, ఇదంత సులభం కాకపోవచ్చు. కొంత పెయిన్ ఉంటుంది. కానీ అమెరికా సంపన్నం కావడానికి ఇదే సరైన తరుణం'' అని వ్యాఖ్యానించారు.

Trump Tariffs: పరుగో పరుగు.. ట్రంప్‌ టారిఫ్‌ బాదుడుతో స్టోర్లకు క్యూ కట్టిన జనం..


ప్రస్తుత పరిణామాలు ఎంతో కాలం ఉండవని, గతంలో ఎన్నడూ లేనంతగా ఉద్యోగాలు, వ్యాపారాలు వెనక్కి తెస్తామని తన ట్రూత్ సోషల్ ఫ్లాట్‌ఫాంలో ట్రంప్ పేర్కొన్నారు. ఇదొక ఆర్థిక విప్లవమని, మనం తప్పనిసరిగా గెలుస్తున్నామని అన్నారు. ఇప్పటికిప్పుడు కష్టంగా ఉందని అనిపించవచ్చనీ, కానీ చిట్టచివరికి చారిత్రక ఫలితాలు చూస్తామని ధీమా వ్యక్తం చేశారు. అమెరికాకు చాలామంది ఇన్వెస్టర్లు వస్తున్నారనీ, పెద్దమొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారని, మునుపెన్నడూ లేనివిధంగా ధనవంతులు కావడానికి ఇదే తగిన తరుణమని అన్నారు. పెద్ద కంపెనీలు టారిఫ్‌లకు భయపడవని, అవి ఇక్కడే ఉంటాయని, పెద్ద పెద్ద డీల్స్‌పైనే ఫోకస్ చేస్తాయని చెప్పారు. ఇందువల్ల ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని చెప్పారు.


కాగా, సుంకాల కారణంగా అమెరికాలో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయనే అంచనాలతో వివిధ స్టోర్లకు అమెరికన్లు క్యూలు కడుతున్నారు. ధరలు పెరగడానికి ముందే వస్తువులు కొనుగోళ్లు చేస్తు్న్నారు. ముఖ్యంగా అమెరికాకు దిగుమతయ్యే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగినట్టు చెబుతున్నారు. అయితే, విదేశీ వస్తువులపై సుంకాల పెంపుతో స్వదేశీ వస్తువులకు గిరాకీ పెరిగి, ఉద్యోగాల కల్పన పెరుగుతుందని, ఆర్థిక వృద్ధి సాధ్యమని ట్రంప్ బలంగా నమ్ముతున్నారు.


Trump Tariffs Shake Global Markets: ఫార్మాపైనా సుంకాలు

Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కి మరో దెబ్బ.. అమెరికా వస్తువులపై కూడా 34% సుంకం..

Read Latest and International News

Updated Date - Apr 05 , 2025 | 08:09 PM