Share News

Prathyekam: డైనింగ్ టేబుల్ కాదు.. నేలపై కూర్చుని తింటే ఎన్ని ప్రయోజనాలో..

ABN , Publish Date - Apr 09 , 2025 | 06:12 PM

ఈ రోజుల్లో చాలా మంది డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని ఆహారం తినడానికి ఇష్టపడతారు. కేవలం తక్కువ మంది మాత్రమే నేలపై కూర్చుని తింటారు. అయితే,నేలపై కూర్చోని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Prathyekam: డైనింగ్ టేబుల్ కాదు.. నేలపై కూర్చుని తింటే ఎన్ని ప్రయోజనాలో..
Eating

నేలపై కూర్చుని ఆహారం తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ప్రస్తుత కాలంలో చాలా మంది ఎక్కువగా డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని ఆహారం తినడానికి ఇష్టపడతారు. కేవలం తక్కువ మంది మాత్రమే నేలపై కూర్చుని తింటారు. అయితే,నేలపై కూర్చోని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


నేలపై కూర్చుని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

కండరాలు బలంగా మారుతాయి : కొంతమందికి నేలపై కూర్చుని తినడం చాలా సౌకర్యంగా ఉంటుంది. నేలపై కూర్చుని తినడం వల్ల కడుపు చుట్టూ ఉన్న కండరాల నొప్పి నుండి ఉపశమనం లభిస్తుందని నిపుణులు అంటున్నారు. మీరు ప్రతిరోజూ ఇలా చేస్తే, మీ కండరాలు మరింత సరళంగా, బలంగా మారుతాయి. ఈ ఆసనం వివిధ శారీరక నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుందని కూడా చెబుతారు.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది: ప్లేట్ నేలపై పెట్టుకుని కూర్చుని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఈ ప్రక్రియలో, ఆహారాన్ని నోటిలో పెట్టడానికి పదే పదే ముందుకు, తర్వాత వెనుకకు వంగి చేసే భంగిమలు శరీరంలో ఆహారాన్ని జీర్ణం చేయడానికి అవసరమైన ఆమ్లాలను ఉత్పత్తి చేస్తాయి. ఫలితంగా, జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా శరీరానికి అవసరమైన శక్తి కూడా లభిస్తుంది.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది : నేలపై కూర్చుని తినడం వల్ల బరువు తగ్గుతారు. మీకు కడుపు నిండినప్పుడు కడుపు నుండి మెదడుకు సంకేతాలను పంపే నాడి ఉంటుంది, తద్వారా మీరు అతిగా తినకుండా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఈ నాడి టేబుల్ వద్ద కంటే నేలపై కూర్చుని తినేటప్పుడు మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది అతిగా తినకుండా ఉండటానికి, మీ బరువును నియంత్రించడంలో మీకు సహాయపడుతుంది.

మనశ్శాంతి: మీరు మీ కుటుంబ సభ్యులందరితో కలిసి నేలపై భోజనం చేస్తే సంబంధాలు బలపడతాయి. మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అయితే, వెన్నునొప్పి లేదా కీళ్ల నొప్పులతో బాధపడేవారు సౌకర్యంగా ఉన్న చోట కూర్చొని తినాలని నిపుణులు సూచిస్తున్నారు.


(NOTE: పై సమాచారం ఆరోగ్య నిపుణుల ఆధారంగా మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)


Also Read:

Vastu Tips: ఈ వస్తువులు ఇంట్లో ఉంటే ఆర్థిక ఇబ్బందులు తప్పవు.. వెంటనే వీటిని విసిరిపారేయండి..

Tips To Remove Tanning Skin: ఎండకు స్కిన్ ట్యాన్ అయిందా.. ఈ 5 చిట్కాలతో తక్షణమే మాయం..

Optical Illusion: మీ ఫోకస్ ఏ రేంజ్‌లో ఉంది.. ఈ పజిల్‌లో భిన్నమైన సంఖ్యను 5 సెకెన్లలో చూడండి..

Updated Date - Apr 09 , 2025 | 06:13 PM