Lunar Eclipse 2025: ఇవాళ ఆ మహిళలు ఈ పనులు అస్సలు చేయకూడదు.. ఎందుకో తెలుసా

ABN, Publish Date - Mar 14 , 2025 | 01:46 PM

ఈ రోజు సంపూర్ణ చంద్ర గ్రహణం ఉంది. చంద్ర గ్రహణం సందర్భంగా గర్భిణులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. జాగ్రత్తం పాటించటం వల్ల కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడని అంటున్నారు.

Lunar Eclipse 2025: ఇవాళ ఆ మహిళలు ఈ పనులు అస్సలు చేయకూడదు.. ఎందుకో తెలుసా

ఈ సారి హోలీ పండుగ రోజే సంపూర్ణ చంద్ర గ్రహణం కూడా వచ్చింది. చంద్ర గ్రహణం సందర్భంగా చంద్రుడు ఎర్రగా మారనున్నాడు. ఈ అరుదైన ఖగోళ అద్భుతం అమెరికా, వెస్ట్రన్ యూరప్, ఆఫ్రికా, పసిఫిక్, అట్లాంటిక్ సముద్ర ప్రాంత ప్రజలకు మాత్రమే కనిపించనుంది. భారతీయులకు ఈ భాగ్యం లేదు. ఎందుకంటే చంద్రగ్రహణం పగటి పూట వస్తోంది. భారత్‌లో ఉదయం 9.29 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3.29 నిమిషాల వరకు చంద్ర గ్రహణం ఉండనుంది. 2022 తర్వాత పూర్తి స్థాయిలో చంద్రగ్రహణం ఏర్పడటం ఇదే మొదటి సారి. 2025 సెప్టెంబర్ నెలలో మరో సారి సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చే అవకాశం ఉంది. ఇక, నేటి చంద్ర గ్రహణం సమయంలో గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని పండితులు హెచ్చరిస్తున్నారు. గ్రహణం పూర్తయ్యే వరకు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. పండితులు చెబుతున్న దాని ప్రకారం గర్భిణులు గ్రహణం రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదంటే..


గర్భిణులు ఏం చేయాలి? ఏం చేయకూడదు?..

చేయాల్సిన పనులు :

1) బయట తిరగకూడదు. ఇంట్లోనే ఉండాలి. చంద్రుడి కాంతి మీద పడకుండా చూసుకుంటే మేలు.

2) మన భారతీయ సంప్రదాయాల ప్రకారం తులసి ఆకులను కానీ, వెండిని కానీ వెంట ఉంచుకుంటే మంచిది.

3) పాజిటివ్‌గా ఉండటానికి ద్యానం చేయండి. మంత్రాలు జపిస్తూ ఉండండి.

4) గ్రహణం విడిచిన అనంతరం తల స్నానం చేసి, ఆ తర్వాత ఆహారం తీసుకోవాలి.

చేయకూడని పనులు :

1) కత్తులు, కత్తెరలు వంటి పదునైన వస్తువుల్ని వాడకూడదు.

2) చంద్ర గ్రహణం రోజు తినకుండా ఉంటే మంచిది.

3) చంద్ర గ్రహణాన్ని చూడటానికి బయటకు అస్సలు వెళ్లకండి.


గ్రహణం రోజున గర్భిణులు ఈ జాగ్రత్తలు పాటించటం వల్ల కడుపులోని బిడ్డ ఆరోగ్యం బాగుంటుందని పండితులు చెబుతున్నారు. ఇక, సంపూర్ణ చంద్ర గ్రహణం కొన్ని రాశుల వారిపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. మేష రాశికి చెందిన వారు ఎమోషనల్‌గా ఇబ్బందులు పడతారు. రిలేషన్‌షిప్ సమస్యలు ఎదుర్కొంటారు. కర్కాటక రాశికి చెందిన వారి జీవితంలో పెను మార్పులు చోటుచేసుకుంటాయి. తుల రాశికి చెందిన వారు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. మకర రాశికి చెందిన వారి జీవితంలో అనుకోని సంఘటనలు కొన్ని జరుగుతాయి.


ఇవి కూడా చదవండి

Trains: రైల్వే ప్రయాణికులకో గుడ్ న్యూస్.. అందేంటంటే..

Bandi Sanjay: 10 లక్షల ఎకరాల్లో పంటలు ఎండినా పట్టదా?

Raja Singh: ముఖ్యమంత్రితో బీజేపీ సీనియర్‌ నేతల రహస్య భేటీలు

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Mar 14 , 2025 | 01:48 PM