Snake Bite: పాము కాటుకు గురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ABN , Publish Date - Apr 15 , 2025 | 11:03 AM
ప్రమాదవశాత్తు పాము కాటుకు గురైనప్పుడు ఆ వ్యక్తి టెన్షన్ పడకుండా చూసుకోవాలి. శరీరాన్ని ఎక్కువగా కదపకూడదు. పరిగెత్తకూడదు. ఇలా చేస్తే గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. అప్పుడు విషం వేగంగా శరీరమంతా వ్యాపిస్తుంది. అందుకే టెన్షన్ పడకుండా ధైర్యంగా ఉండాలి. ఈ చిట్కాలు పాటిస్తే ప్రమాదం నుంచి బయటపడొచ్చు.

ABN Internet: పాములను (Snakes) చూడగానే కొంతమంది జనాలు భయపడుతుంటారు. వెంటనే అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే పాము కాటు వేస్తే చనిపోతామని భయపడుతుంటారు. పాము కాటు (Snake Bite) వేసినప్పుడు ఏమి చేయాలో ఏమి చేయకూడదో తెలుసుకుందాం. ప్రమాదవశాత్తు పాము కాటుకు గురైనప్పుడు ఆ వ్యక్తి టెన్షన్ (Tension) పడకుండా చూసుకోవాలి. శరీరాన్ని ఎక్కువగా కదపకూడదు. పరిగెత్తకూడదు. ఇలా చేస్తే గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. అప్పుడు విషం వేగంగా శరీరమంతా వ్యాపిస్తుంది. అందుకే టెన్షన్ పడకుండా ధైర్యంగా ఉండాలి.
Also Read..: చిత్తూరు జిల్లాలో పరువు హత్య..
పాము ఎదురు పడితే ..
భారతదేశంలో అనేక రకాల పాములు ఉన్నాయి. కానీ ఆ పాములలో 20 శాతం మాత్రమే విషపూరితమైనవి. పాము కాటు వేసిన తర్వాత, ఒక వ్యక్తి చాలా భయపడతాడు, దీని వలన వారి హృదయ స్పందన రేటు పెరుగుతుంది.. విషం శరీరమంతా త్వరగా వ్యాపిస్తుంది. కాబట్టి పాము కాటు వేసినప్పుడు భయపడకూడదు. అయితే, పాము ఎదురుపడితే ఎలా తప్పించుకోవాలో కూడా తెలిసి ఉండటం మంచిది. విషపూరిత పాము కాటుకు గురైతే ఏం చేయాలి.. పాము ఎదురు పడితే ఎలా తప్పించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..
టెన్షన్ పడకూడదు..
ఎక్కడైనా, ఎప్పుడైనా పామును ఎదురుపడితే భయపడకూడదు.. టెన్షన్ పడకూడదు.. పాముకు ఎదురుగా ఎలాంటి కదలికలు చేయకూడదు.. పాము ఉన్న దిశలో పరుగెత్తకూడదు... అలాగే పాముపై ఏదైనా విసిరేందుకు కూడా ప్రయత్నించకూడదు.. వాటిని ఇబ్బంది పెట్టకుండా ఉన్నంత వరకు అవి ఎలాంటి హానీ చేయవు. అలాగే చాలా పాములు జన సంచారంలోకి రావడానికి ఇష్టపడవు, ఎందుకంటే వాటికి కూడా చంపుతారనే భయం ఉంటుంది.
పాము కాటు వేసినప్పుడు..
పాము కాటు వేసినప్పుడు ఒంటరిగా ఉంటే, వెంటనే 108కు ఫోన్ చేయాలి.. లేదా చుట్టూ ఉన్న వ్యక్తుల సహాయం తీసుకోవాలి.. వీలైనంత త్వరగా ఆసుపత్రికి వెళ్లాలి. కాటేసిన పాము రకం లేదా పాము రంగు, పొడవు, చారలు, మెడ రేఖ మొదలైన వాటి గురించి సమాచారం అందిస్తే చికిత్స మరింత సులభం అవుతుంది. పాము కాటుకు గురైన ప్రదేశం నుంచి విషం శరీరమంతా వ్యాపించకుండా ఉండటానికి ఆ ప్రదేశంలో బలమైన తాడు లేదా వస్త్రాన్ని కట్టుకుంటారు. ఇది విషం మరింత వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది.. కానీ అలా చేయడం కూడా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల రక్తం సరఫరా లేకపోవడం వల్ల ఆ భాగానికి శాశ్వత నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు. వీలైనంత త్వరగా ఆస్పత్రికి వెళ్లాలి. ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం, పాము కాటుకు గురైన వ్యక్తికి వెంటనే నెయ్యి తినిపించి, విషం లోపలికి వ్యాపించకుండా ఉండటానికి వాంతి చేసుకోవాలని.. అలాగే, పాము కాటు వేసిన వ్యక్తికి వేడి ఆహారం ఇచ్చి 10 నుండి 15 సార్లు వాంతి చేసుకోవాలని నిపుణులు సూచించారు.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. పాములు ఎక్కువగా రాళ్లు, అడవుల్లోని గడ్డిపొదలు, మూలల్లో దాక్కోవడానికి ఇష్టపడతాయి. అలాంటి ప్రదేశాల దగ్గర నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాంటి ప్రదేశాలను క్లీన్ చేస్తున్నప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. పాము కాటేసిన చోట గాయాన్ని కోసి.. విషాన్ని బయటకు తీసే ప్రయత్నం కూడా చేయరాదు. పాము కాటువేసిన గాయం చుట్టూ టేపు లాంటిది కూడా కట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. సాధ్యమైనంత త్వరగా దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
పూజారి తన్నుల కోసం బారులు తీరిన భక్తులు
శ్రీశైల మహాక్షేత్రంలో వార్షిక కుంభోత్సవం...
కమల్ హాసన్‌కు రాజ్యసభ సభ్యత్వం..
For More AP News and Telugu News