Mahakumbhmela: మహాకుంభమేళాపై సోషల్ మీడియాలో తప్పుదారి పట్టించే కంటెంట్.. కేసులు నమోదు
ABN, Publish Date - Feb 24 , 2025 | 10:09 AM
మహాకుంభమేళాకు సంబంధించి తప్పుదారి పట్టించే కంటెంట్‌ను వ్యాప్తి చేస్తున్న 140 సోషల్ మీడియా అకౌంట్లపై ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేసినట్టు యూపీ పోలీసులు పేర్కొన్నారు.

ఇంటర్నెట్ డెస్క్: మహాకుంభమేళాపై తప్పుదారి పట్టించే కంటెంట్‌ను సోషల్ మీడియాలో పెట్టిన వారిపై కేసులు నమోదు చేసినట్టు మహాకుంభ్ డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు. మొత్తం 140 సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై 13 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్టు వెల్లించారు. ఇక రాబోయే మహా శివరాత్రి పండుగకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా ఆయన వెల్లడించారు. మహాకుంభ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఎంత పెద్ద జన సందోహానికైనా తాము పూర్తిస్థాయి సన్నద్ధతతో ఉన్నట్టు భరోసా ఇచ్చారు.
PM Modi: చవకగా కేన్సర్ మందులు, దేశవ్యాప్తంగా డేకేర్ సెంటర్లు
ఇక కుంభమేళా సందర్భంగా ఆదివారం నాటి వరకూ త్రివేణి సంగమంలో దాదాపు 62 కోట్ల మంది పుణ్య స్నానాలు చేశారని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక ప్రయాణికుల రద్దీ నిర్వహణ కొరకు అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల భద్రత కోసం పలు చర్యలు తీసుకున్నారు.
CM Stalin: కుటుంబ నియంత్రణతో లోక్‌సభ సీట్లు తగ్గే అవకాశం: స్టాలిన్ ఆందోళన
ఇక వచ్చే మహాశివరాత్రికి కూడా భారీగా భక్తజన సందోహం మహాకుంభ్‌కు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శివరాత్రి రోజు స్నానాలకు సంబంధించి మహాకుంభ ప్రాంతంలో భారీ ఏర్పాట్లు చేశారు. అదనపు భద్రతా సిబ్బందిని నియమించాము. అన్ని చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశాము. పుణ్యస్నానికి కొచ్చిన ప్రయాణికులు వేచి చూసేందుకు హోల్డింగ్ ఏరియా కూడా సిద్ధం చేశాము’’ అని తెలిపారు. రద్దీ కారణంగా అవాంఛిత ఘటనలు జరగకుండా రైళ్లకు సంబంధించి ఎక్కడిక్కడ అనౌన్స్‌మెంట్లు వినిపించేలా స్పీకర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Feb 24 , 2025 | 03:33 PM