ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pontoon Bridge: నదిలో నిర్మాణాలు!

ABN, Publish Date - Jan 13 , 2025 | 03:58 AM

ఈ ఫొటో చూశారా!? ఎదురుగా అంతెత్తున ఫ్లై ఓవర్‌. అది దాటిన తర్వాత రెండు రైల్వే బ్రిడ్జిలు!

గంగా, యమున నదులపై 32 పాంటూన్‌ బ్రిడ్జిలు.. అవన్నీ తాత్కాలిక ప్రాతిపదికనే

(ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళా ప్రాంగణం నుంచి ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ప్రతినిధి)

ఈ ఫొటో చూశారా!? ఎదురుగా అంతెత్తున ఫ్లై ఓవర్‌. అది దాటిన తర్వాత రెండు రైల్వే బ్రిడ్జిలు! వాటికన్నా ముందు ఓ చిన్న బ్రిడ్జి ఉంది చూశారా!? దానినే పాంటూన్‌ బ్రిడ్జ్‌ అంటారు! మహా కుంభమేళాలో ఈ తాత్కాలిక బ్రిడ్జిలు ప్రత్యేకం కూడా! కుంభమేళాకు కోట్లాది మంది వస్తారు. వారికి రవాణా ఇక్కడ అతి పెద్ద సవాలు. దానిని అధిగమించడానికి వీటిని నిర్మిస్తారు. ఓవైపు నదిలో నీరు ప్రవహిస్తూనే ఉంది.. మరోవైపు భారీ ఇనుప గోళాలతో బ్రిడ్జిలను నిర్మించేస్తూనే ఉన్నారు. ఒక్కో ఇనుప గోళం దాదాపు ఆరు టన్నుల వరకూ బరువు ఉంటుందని అంచనా. గత కుంభమేళా సందర్భంగా కేవలం 18 పాంటూన్‌ బ్రిడ్జిలను నిర్మిస్తే.. ఈసారి గంగా, యమున నదులపై 32 నిర్మించారు. అవసరమైనచోట మరిన్ని నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. పట్టణంలోని గంగా నదిలో దాదాపు వంద మీటర్లకు ఒకటి చొప్పున ఇవి కనిపించాయి. వీటిపై నుంచి మనుషులు మాత్రమే కాదు.. కార్లు కూడా ఎంచక్కా వెళుతున్నాయి. కుంభమేళా ఏర్పాట్లలో భాగంగా ప్రయాగ్‌రాజ్‌లో నది, నదీతీరంలోనే భారీ నిర్మాణాలు చేపడుతున్నారు. అవన్నీ కూడా తాత్కాలికంగానే. అయితే, సాధారణ సమయాల్లో రవాణాకు పాంటూన్‌ బ్రిడ్జిలు ఎంతో అనుకూలమే కానీ, లక్షలాదిమంది వచ్చినప్పుడు.. తొక్కిసలాట వంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు వీటిపై భద్రత ప్రశ్నార్థకమే.


జీహెచ్‌ఎంసీ వైశాల్యంలో దాదాపు సగం మాత్రమే ఉండే ప్రయాగ్‌రాజ్‌కు నెలన్నర సమయంలోనే దాదాపు 40 కోట్ల మంది వస్తారని అంచనా. అందులోనూ, ఇప్పుడు 144 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే మహా కుంభమేళా!! అందుకనుగుణంగా భారీ ఏర్పాట్లు చేస్తున్న ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం.. వీలుకాని చోట తాత్కాలిక నిర్మాణాలకే మొగ్గు చూపుతోంది. ఇనుప రేకులు, థర్మోకూల్‌ షీట్లు తదితరాలతోనే మీడియా సెంటర్‌ వంటి నిర్మాణాలూ చేస్తోంది. అంతేనా.. వివిధ అఖాడాలు తమ టెంట్లు వేసుకోవడానికి స్థలాన్ని కూడా ఈ నదీ తీరాల్లోనే ఇచ్చారు. అక్కడి ఇసుకలోనే అఖాడాలకు చెందిన స్వాములు, మఠాలు టెంట్లు వేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తున్న కళాగ్రామ్‌ను కూడా ఈ నదీ తీర ప్రాంతంలోనే ఏర్పాటు చేస్తుండడం విశేషం. ఇప్పుడు వర్షాకాలం కాకపోవడం, నదిలో పెద్దగా నీరు లేకపోవడం ఇందుకు కలిసి వచ్చింది. ఇక, త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం చేయడానికి వచ్చే వీఐపీల కోసం గంగానది ఒడ్డునే నీటిలో తేలియాడే జెట్టీలు తయారు చేశారు. హెచ్‌డీపీఈ కంటైనర్లను పెద్దఎత్తున ఉపయోగించి దీనిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఒడ్డు నుంచి జెట్టీలోకి వెళ్లడానికి కూడా వీటితోనే మార్గం ఏర్పాటు చేశారు.

Updated Date - Jan 13 , 2025 | 03:58 AM