Air India: ఎయిర్ ఇండియా విమానాల్లో వైఫై సేవలు
ABN , Publish Date - Jan 02 , 2025 | 05:22 AM
దేశంలోనే తొలిసారిగా ఎయిర్ ఇండియా తమ విమాన సర్వీసుల్లో వైఫై సేవలు ప్రారంభించింది. దేశీయంగా ఈ సేవలు ప్రస్తుతానికి ఉచితంగా అందిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.
దేశీయ సర్వీసుల్లో తొలిసారి ఈ సేవలు
న్యూఢిల్లీ, జనవరి1: దేశంలోనే తొలిసారిగా ఎయిర్ ఇండియా తమ విమాన సర్వీసుల్లో వైఫై సేవలు ప్రారంభించింది. దేశీయంగా ఈ సేవలు ప్రస్తుతానికి ఉచితంగా అందిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్ ఇండియా ఎయిర్ బస్ ఏ-350, బోయింగ్ 787-9, ఎయిర్ బస్ ఏ321 నియో ఎయిర్ క్రాఫ్టులలో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. విమానం పదివేల అడుగులకు చేరాక ప్రయాణికులకు వైఫై సేవలు అందుతాయి. లాప్‌టాప్, టాబ్లెట్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ వ్యవస్థలున్న స్మార్ట్ ఫోన్‌లకు వైఫై కనెక్టివిటీ ఉంటుంది.
ఇంటర్‌నెట్ అందుబాటులోకి రావడంతో ఇక విమాన ప్రయాణ సమయాల్లోనూ స్నేహితులకు, బంధువులకు ఎప్పటికప్పుడు సందేశాలు పంపవచ్చు. సోషల్ మీడియాలో వెంటనే అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఎయిర్ ఇండియా ఇప్పటికే సింగపూర్, లండన్, పారిస్, న్యూయార్క్‌కు నడిపే అంతర్జాతీయ సర్వీసుల్లో వైఫై సేవలు అందిస్తోంది. ఎయిర్‌బస్ ఏ 350, ఎయిర్‌బస్ ఏ321 నియో, బోయింగ్ బీ787-9 ఎయిర్‌క్రాఫ్టులలో ఈ సేవలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.