Assam: పేపర్ లీక్‌తో అసోం 11వ తరగతి పరీక్షలు రద్దు
ABN , Publish Date - Mar 24 , 2025 | 02:34 AM
ఈనెల 6న ప్రారంభమైన 11వ తరగతి పరీక్షలు 29వ తేదీ వరకు కొనసాగాల్సి ఉంది. గణితం ప్రశ్నపత్రం ఒకరోజు ముందుగానే లీక్ అయ్యి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో 21న జరగాల్సిన ఆ పరీక్షను రద్దు చేశారు.

గువాహటి, మార్చి 23: అసోంలో జరుగుతున్న 11వ తరగతి పరీక్షలు రద్దు అయ్యాయి. పలుచోట్ల గణితం పశ్నపత్రం లీక్ అవ్వడంతో సోమవారం నుంచి జరగాల్సిన మిగిలిన పరీక్షలను రద్దు చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రనోజ్ పేగు వెల్లడించారు. ఈనెల 6న ప్రారంభమైన 11వ తరగతి పరీక్షలు 29వ తేదీ వరకు కొనసాగాల్సి ఉంది. గణితం ప్రశ్నపత్రం ఒకరోజు ముందుగానే లీక్ అయ్యి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో 21న జరగాల్సిన ఆ పరీక్షను రద్దు చేశారు. ఈ క్రమంలో మిగిలిన పరీక్షలను కూడా రద్దు చేశారు. సోమవారం జరగనున్న బోర్డు సమావేశంలో కొత్త షెడ్యూల్‌కు సంబంధించి నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. పేపర్ లీక్‌కు సంబంధించి 15 ప్రైవేట్ విద్యా సంస్థల అఫిలియేషన్‌ను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు