Cash Row: అలహాబాద్ హైకోర్టు జడ్జిగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ వర్మ
ABN , Publish Date - Apr 05 , 2025 | 03:56 PM
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల సిఫారసు చేసింది. దీనిని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ వ్యతిరేకించనప్పటికీ కొలీజియం సిఫారసును మార్చి 28న కేంద్ర ఆమోదించింది.

న్యూఢిల్లీ: నోట్ల కట్టల వివాదంలో చిక్కుకున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yashwant Varma) శనివారంనాడు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేశారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా ప్రైవేటు ఛాంబర్‌లో ఆయన ప్రమాణస్వీకారం జరిగింది. సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ విచారణను ఆయనను ఎదుర్కొంటున్నందున అలహాబాద్ హైకోర్టులో ఎలాంటి న్యాయ విధులను అప్పగించలేదు. ప్రస్తుతం అలహాబాద్ చీఫ్ జస్టిస్ తర్వాత సీనియారిటీలో జస్టిస్ వర్మ ఆరో స్థానంలో ఉన్నారు.
PM Modi: మోదీకి శ్రీలంక 'మిత్ర విభూషణ' పురస్కారం
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల సిఫారసు చేసింది. దీనిని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ వ్యతిరేకించనప్పటికీ కొలీజియం సిఫారసును మార్చి 28న కేంద్ర ఆమోదించింది. బార్ అసోసియేషన్ డిమాండ్‌ను పరిశీలిస్తామని సీజేఐ సంజీవ్ ఖన్నా హామీ ఇవ్వడంతో తమ ఆందోళనను అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ విరమించింది.
జస్టిస్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ గత వారంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే దీనిని' ప్రీమెచ్యూర్' పిటిషన్‌గా సుప్రీంకోర్టు భావిస్తూ దానిని కొట్టివేసింది. త్రిసభ్య కమిటీ విచారణ జరుపుతున్నందున అది పూర్తి కాగానే ఎఫ్ఐఆర్ నమోదు చేసే విషయంలో నిర్ణయం తీసుకుంటామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మార్చి 14న జస్టిస్ వర్మ నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఆయన సిటీలో లేరు. అగ్నిమాపక సిబ్బంది అక్కడి చేరుకుని మంటలు ఆర్పారు. ఆ సమయంలో స్టోర్ రూమ్‌లో పెద్దఎత్తున కాలిన నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఆ నోట్ల కట్టలతో తనకు సంబంధం లేదని జస్టిస్ వర్మ పేర్కొన్నారు. ఈ ఘటన పెద్దఎత్తున విమర్శలకు దారితీయడంతో నిజానిజాలు వెలికి తీసేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని సీజేఐ నియమించారు.
ఇవి కూడా చదవండి..
Chennai: రేపు ప్రధాని మోదీతో ఈపీఎస్, ఓపీఎస్ భేటీ
Earthquake: పలు దేశాల్లో కంపిస్తోన్న భూమాత.. క్షణ క్షణం.. భయం భయం
For National News And Telugu News