Congress: వక్ఫ్‌ బిల్లు.. రాజ్యాంగంపై దాడి!

ABN, Publish Date - Mar 24 , 2025 | 02:55 AM

శతాబ్దాల కాలం నుంచి బలంగా ఉన్న మన దేశ బహుళ మత సమాజ సామరస్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ నిరంతరంగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా దీన్ని తీసుకొచ్చారని ఆరోపించింది. తప్పుడు ప్రచారం చేయడం, దురభిప్రాయాలను సృష్టించడం ద్వారా మైనారిటీ వర్గాలను బూచిగా చూపేందుకు బీజేపీ యత్నిస్తోందని విమర్శించింది.

Congress: వక్ఫ్‌ బిల్లు.. రాజ్యాంగంపై దాడి!

మత సామరస్యాన్ని దెబ్బతీసే బీజేపీ వ్యూహంలో భాగమే: జైరాం రమేశ్‌

న్యూఢిల్లీ, మార్చి 23: కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్‌ (సవరణ) బిల్లును రాజ్యాంగంపై దాడిగా కాంగ్రెస్‌ పేర్కొంది. శతాబ్దాల కాలం నుంచి బలంగా ఉన్న మన దేశ బహుళ మత సమాజ సామరస్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ నిరంతరంగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా దీన్ని తీసుకొచ్చారని ఆరోపించింది. తప్పుడు ప్రచారం చేయడం, దురభిప్రాయాలను సృష్టించడం ద్వారా మైనారిటీ వర్గాలను బూచిగా చూపేందుకు బీజేపీ యత్నిస్తోందని విమర్శించింది. వక్ఫ్‌ బిల్లు పూర్తిగా లోపభూయిష్టమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వక్ఫ్‌లను నిర్వహించేందుకు గత చట్టాల ద్వారా ఏర్పాటు చేసిన సంస్థల స్థాయి, అధికారాన్ని తగ్గించేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. వక్ఫ్‌ ప్రయోజనాల కోసం భూమిని ఎవరు దానం చేయవచ్చో నిర్ణయించడంపై ఉద్దేశపూర్వకంగా అస్పష్టత ఇచ్చారని, వక్ఫ్‌ నిర్వచనాన్నే మార్చారని రమేశ్‌ ఆరోపించారు. వక్ఫ్‌ పాలనను బలహీనం చేసేందుకు ప్రస్తుతం ఉన్నచట్టంలోని నిబంధనలు తొలగించారని, వక్ఫ్‌ భూములను అక్రమించిన వారికి రక్షణ కల్పించేలా మార్పులు చేశారని ఆరోపించారు. వక్ఫ్‌ ఆస్తులపై వివాదాలు, వాటి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అంఽశాలపై కలెక్టర్లు, నియమించిన ఇతర రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు విశేష అధికారాలు కల్పించడాన్ని ఆయన తప్పుబట్టారు.

బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళన

వక్ఫ్‌ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త ఆందోళన చేపట్టనున్నట్టు ఆదివారం ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ప్రకటించింది. ఈ నెల 17న ఢిల్లీలో నిర్వహించిన నిరసన ప్రదర్శన విజయవంతం కావడంతో జాతీయస్థాయి ఆందోళన జరపాలని కార్యాచరణ రూపొందించినట్టు తెలిపింది. ఇందుకోసం 31 మందితో యాక్షన్‌ కమిటీని ఏర్పాటు చేసింది. మొదట దశలో భాగంగా ఈ నెల 26న పట్నాలోని అసెంబ్లీ ఎదుట, 29న విజయవాడ (అమరావతి)లోని అసెంబ్లీ ఎదుట ధర్నాలు చేయనున్నట్టు తెలిపింది. ‘వక్ఫ్‌ బిల్లుకు మద్దతు ఉపసంహరించండి...లేకుంటే మా మద్దతును కోల్పోతారు’ అన్న సందేశాన్ని బీజేపీ మిత్ర పక్షాలకు పంపించడమే ఈ ధర్నాల ఉద్దేశమని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ప్రదర్శనలను జరుపుతామని, ముఖ్యంగా హైదరాబాద్‌, ముంబయి. కోల్‌కతా, బెంగళూరు, మలేర్‌కోట్లా (పంజాబ్‌), రాంచీల్లో భారీ ఊరేగింపులు ఉంటాయని వివరించారు.

ఇవి కూడా చదవండి..

Delhi High Court Judge: నోట్ల కట్టల ఆరోపణలు నిరాధారం.. జస్టిస్ యశ్వంత్ వర్మ

Karnataka: ఘోర ప్రమాదం.. భారీ రథాలు కూలిపోయి.. బాబోయ్..

Navy Employee Case: నాకు ఫుడ్ వద్దు.. డ్రగ్స్ కావాలి.. నిందితురాలి కొత్త డిమాండ్

Read Latest and National News

Updated Date - Mar 24 , 2025 | 02:55 AM