ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi: సర్కారుకు రూ.2,026 కోట్ల నష్టం!

ABN, Publish Date - Jan 12 , 2025 | 05:43 AM

అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఢిల్లీ రాజకీయాల్లో మరోమారు ‘మద్యం విధానం’ చిచ్చు రేగింది.

ఢిల్లీ మద్యం విధానానికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆమోదం పొందలేదు

మంత్రి మండలి అనుమతి కూడా లేదు

స్పష్టం చేసిన కాగ్‌ నివేదిక!

ఎన్నికల వేళ ఢిల్లీ రాజకీయాల్లో చిచ్చు!

న్యూఢిల్లీ, జనవరి 11: అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఢిల్లీ రాజకీయాల్లో మరోమారు ‘మద్యం విధానం’ చిచ్చు రేగింది. కేజ్రీవాల్‌ సర్కారు అమలు చేసిన కొత్త మద్యం విధానం-2021 వల్ల ప్రభుత్వానికి రూ.2,026 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) నిగ్గుతేల్చింది. వాస్తవానికి కేంద్ర బడ్జెట్‌కు ముందు విడుదలవ్వాల్సిన కాగ్‌ నివేదికలో.. లిక్కర్‌ పాలసీ వివరాలు లీకైనట్లు జాతీయ మీడియా కథనాలను ప్రసారం చేసింది. ఈ పాలసీ ద్వారా నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) సర్కారు విఫలమైనట్లు కాగ్‌ స్పష్టంచేసింది. ఈ విధానం అమలుకు ముందు నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులను అప్పటి ఉప ముఖ్యమంత్రి సిసోడియా నేతృత్వంలోని మంత్రుల బృందం విస్మరించిందని ఆక్షేపించింది. కీలక నిర్ణయాల విషయంలో మంత్రి మండలి, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆమోదం కూడా తీసుకోలేదని వెల్లడించింది. లైసెన్సుల జారీ, నిబంధనల విషయంలో ఉల్లంఘనలు జరిగినట్లు తెలిపింది. పలు ఫిర్యాదులున్నప్పటికీ.. ఆర్థిక స్థితిగతులను అంచనా వేయకుండానే.. అన్ని సంస్థలను వేలానికి అనుమతించినట్లు.. వాటి లైసెన్సులను పునరుద్ధరించినట్లు వివరించింది. కాగా.. ఈ మద్యం విధానం వ్యవహారంలో ఇప్పటికే సీబీఐ, ఈడీ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో కేజ్రీవాల్‌, సిసోడియా తదితరులు అరెస్టు అయి, తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు.

రాజకీయాల్లో వాగ్యుద్ధం

వచ్చేనెల 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఢిల్లీలో ఇప్పుడు కాగ్‌ నివేదిక చిచ్చు రాజకీయాల్లో వాగ్యుద్ధానికి తెరతీసింది. అధికార ఆప్‌పై విపక్ష బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు విమర్శలు గుప్పించగా.. వాటిని ఆమ్‌ ఆద్మీ నేతలు తిప్పికొట్టారు. ‘‘కేజ్రీవాల్‌ విలాసవంతమైన అద్దాల మేడలో ఉంటారు. ప్రజలు మాత్రం మురికివాడల్లో నివసిస్తున్నారు’’ అని అమిత్‌షా విమర్శించారు. ఆప్‌ నేతల అవినీతిని కాగ్‌ నివేదిక బట్టబయలు చేసిందని నడ్డా అన్నారు. కాంగ్రెస్‌ నేత సందీప్‌ దీక్షిత్‌ కూడా ఈ అంశంపై తీవ్రంగా స్పందిస్తూ.. కేజ్రీవాల్‌ అవినీతికి పాల్పడ్డారనే విషయం స్పష్టమైందన్నారు. ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ ఈ విమర్శలను తిప్పికొట్టారు. కాగ్‌ ఇంకా నివేదికను సమర్పించలేదని బీజేపీ స్వయంగా అంగీకరించిందని గుర్తుచేశారు. ఒకవేళ నివేదిక నిజమైతే.. అదెక్కడుందో చూపాలని బీజేపీ, కాంగ్రెస్‌ నేతలకు సవాల్‌ విసిరారు.

Updated Date - Jan 12 , 2025 | 05:43 AM