ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Dalit Athlete: దళిత క్రీడాకారిణిపై 62 మంది అత్యాచారం

ABN, Publish Date - Jan 12 , 2025 | 05:55 AM

కేరళకు చెందిన ఓ దళిత క్రీడాకారిణిపై పలువురు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. 18 ఏళ్ల ఆ జిల్లా స్థాయి క్రీడాకారిణిపై గత అయిదేళ్లుగా కనీసం 62 మంది ఈ దారుణానికి పాల్పడినట్టు శనివారం పోలీసు వర్గాలు తెలిపాయి.

కేరళలో అయిదేళ్లుగా దారుణం.. 15 మంది అరెస్టు

పథనంథిట్ట, జనవరి 11: కేరళకు చెందిన ఓ దళిత క్రీడాకారిణిపై పలువురు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. 18 ఏళ్ల ఆ జిల్లా స్థాయి క్రీడాకారిణిపై గత అయిదేళ్లుగా కనీసం 62 మంది ఈ దారుణానికి పాల్పడినట్టు శనివారం పోలీసు వర్గాలు తెలిపాయి. ఇప్పటికే 15 మంది నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్టు పేర్కొన్నాయి. ఇందులో 40 మందిపై పోక్సో చట్టం కింద కేసులు పెట్టారు. ఆ బాలిక 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆమెపై లైంగిక దాడి జరిగింది. పొరుగింటి వ్యక్తి ఒకరు బలవంతంగా ఆమెను కొండ పక్కన ఉన్న ఇంటి తీసుకువెళ్లి బూతు చిత్రాలు చూపించాడు. అనంతరం అతడు, అతని స్నేహితులు అత్యాచారం చేశారు. పోటీల నిమిత్తం వివిధ ప్రదేశాలకు వెళ్లినప్పుడు తోటి ఆటగాళ్లు, కోచ్‌లు కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అయితే దీనిని ఇంతవరకు ఆమె తల్లిదండ్రులకు చెప్పలేదు. తండ్రి మద్యానికి బానిస కావడంతో పెద్దగా పట్టించుకోలేదు. ఆమె తన తండ్రి సెల్‌ఫోన్‌నే ఉపయోగించుకునేది. ఆ ఫోన్‌లోని కాంటాక్టు లిస్టులో ఉన్న వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడినట్టు తేలింది. కేరళ మహిళా సమాఖ్య సొసైటీ వాలంటీర్లు ఇటీవల క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్న క్రమంలో ఈ నేరం వెలుగులోకి వచ్చింది. దీనిపై జిల్లా శిశు సంక్షేమ కమిటీ కమిటీ చైర్మన్‌, న్యాయవాది ఎన్‌.రాజీవ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపైనివేదిక ఇవ్వాలని మహిళా కమిషన్‌ రాష్ట్ర అధికారులను ఆదేశించింది.

Updated Date - Jan 12 , 2025 | 05:55 AM