Fake Doctor: లండన్ డాక్టర్‌నన్నాడు..ఏడుగురి ప్రాణాలు తీశాడు
ABN , Publish Date - Apr 07 , 2025 | 04:31 AM
లండన్ డాక్టర్ జాన్ కెమ్‌గా నటించి మధ్యప్రదేశ్‌లో నకిలీ డాక్టర్ నరేంద్ర యాదవ్ 15 మందికి గుండె శస్త్రచికిత్సలు చేసి ఏడుగురి ప్రాణాలు హరించాడు. ఈ విషయం జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.

భోపాల్, ఏప్రిల్ 6: లండన్ నుంచి వచ్చిన ప్రముఖ వైద్యుడిని జాన్ కెమ్‌ను తానేనంటూ.. మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి 15 మంది రోగులకు శస్త్రచికిత్సలు చేసి ఏడుగురి ప్రాణాలను హరించాడు. మధ్యప్రదేశ్‌లోని దామోలో ఓ మిషనరీ ద్వారా నడుస్తున్న ఆసుపత్రిలో నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ అనే వ్యక్తి నెరిపిన ఈ వ్యవహారానికి సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ)కు ఫిర్యాదు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నరేంద్ర లండన్‌లో ప్రముఖ కార్డియాలజిస్టు నిపుణుడు జాన్ కెమ్‌గా అవతారమెత్తి, జనవరి నుంచి ఫిబ్రవరి మధ్య 15 మందికి గుండె శస్త్రచికిత్సలు నిర్వహించాడని దీపక్ తివారీ అనే వ్యక్తి ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశాడు. వీరిలో ఏడుగురు మృతి చెందారని, ఈ వ్యవహారానికి సంబంధించి ఆసుపత్రికి తెలిసినప్పటికీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి:
జెలెన్‌స్కీ సొంత నగరంపై రష్యా దాడి
Read Latest and International News