Mamata Banerjee: నకిలీ ఓటర్లతో ఢిల్లీ, మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపు
ABN , Publish Date - Feb 28 , 2025 | 04:43 AM
ఈసీ మద్దతుతో ఇతర రాష్ట్రాలకు చెందిన నకిలీ ఓటర్లను ఎన్నికల జాబితాలో చేర్చినట్టు ఆమె పేర్కొన్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి బీజేపీ ఈ వ్యూహాన్ని అనుసరించినట్టు చెప్పారు.

బీజేపీపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణ
కోల్‌కతా, ఫిబ్రవరి27: బీజేపీతోపాటు ఎన్నికల కమిషన్ (ఈసీ)పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈసీ మద్దతుతో ఇతర రాష్ట్రాలకు చెందిన నకిలీ ఓటర్లను ఎన్నికల జాబితాలో చేర్చినట్టు ఆమె పేర్కొన్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి బీజేపీ ఈ వ్యూహాన్ని అనుసరించినట్టు చెప్పారు. గురువారంనాడిక్కడ నేతాజీ ఇండోర్ స్టేడియంలో టీఎంసీ రాష్ట్ర సదస్సులో పాల్గొన్న సందర్భంగా మమత మాట్లాడారు. హరియాణా, గుజరాత్ నుంచి నకిలీ ఓటర్లను చేర్చడం ద్వారా ఢిల్లీ, మహారాష్ట్రలో బీజేపీ విజయం సాధించిందన్నారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లోనూ ఇదే చేయాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ నియామకం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల జాబితాను సరిచేసే విధంగా తగిన చర్యలు తీసుకోకుంటే ఎన్నికల కమిషన్ కార్యాలయం ముందు తమ పార్టీ ధర్నా నిర్వహిస్తుందని మమత హెచ్చరించారు. కాగా 2026లో జరగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకుగాను 215కు పైగా సీట్లను సాధించాలని మమత లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
మరిన్ని తెలుగు వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: గిన్నిస్ రికార్డులు సృష్టించిన మహాకుంభ మేళ
Also Read: ప్యూర్ ఈవీ వినియోగదారులకు బంపర్ ఆఫర్
For National News And Telugu News