Bijapur: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఐదుగురు నక్సల్స్ మృతి
ABN, Publish Date - Jan 13 , 2025 | 04:06 AM
ఛత్తీ్‌సగఢ్‌లోని బీజాపూర్‌లో మరోమారు తుపాకీ గర్జించింది. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం పోలీసులు-మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు నక్సల్స్ మృతిచెందారు.
5 తుపాకులు, ఒక బీజీఎల్ లాంచర్ సీజ్
నారాయణపూర్ జిల్లాలో భారీ డంప్
వాటిలో భారీగా బాణం బాంబులు
సుక్మాలో ఐఈడీ పేలి బాలికకు గాయాలు
బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్ ఐదుగురు నక్సల్స్ మృతి
చర్ల, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ఛత్తీ్‌సగఢ్‌లోని బీజాపూర్‌లో మరోమారు తుపాకీ గర్జించింది. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం పోలీసులు-మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు నక్సల్స్ మృతిచెందారు. వీరిలో ఇద్దరు మహిళలున్నాయి. శనివారం నేషనల్ పార్క్ సమీపంలో మావోయిస్టులు సమావేశమైనట్లు భద్రతాబలగాలకు ఉప్పందింది. దీంతో.. డీఆర్‌జీ, బస్తర్ ఫైటర్స్, కోబ్రా బలగాలు కూంబింగ్ ప్రారంభించాయి. ఆదివారం ఉదయం మావోయిస్టులు తారసపడడంతో ఇరువర్గాల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో ఇద్దరు మహిళలున్నారు. మృతులను ఇంకా గుర్తించాల్సి ఉందని చెప్పారు. కాగా.. ఆదివారం నారాయణ్‌పూర్ జిల్లా గుమ్‌చూర్ కొండల్లో మావోయిస్టులకు చెందిన భారీ డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 15 బాణం బాంబులు, వైర్లు, ప్రెషర్‌కుక్కర్లు, రేడియోలు, ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు సుక్మా జిల్లా తిమ్మాపురంలో ఐఈడీ పేలి 11 ఏళ్ల బాలికకు తీవ్ర గాయాలయ్యాయి.
Updated Date - Jan 13 , 2025 | 04:06 AM