Chicken Neck History: ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన చికెన్ నెక్ చరిత్ర ఇదే
ABN , Publish Date - Apr 02 , 2025 | 09:01 AM
పశ్చిమబెంగాల్‌లోని సిలిగురి కారిడార్ యొక్క మరోపేరు చికెన్ నెక్. కోడి మెడ ఆకారంలో ఉండటంతో ఈ ప్రాంతానికి చికెన్ నెక్ అనే పేరు వచ్చింది. ఈ ప్రాంతంలో భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలను దేశంతో అనుసంధానించే ఒక సన్నని భూభాగం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సిలిగురి నగరం చుట్టూ ఉన్న 20 నుంచి 22 కిలోమీటర్లు ఉండే ఈ ప్రాంతం అంతర్జాతీయ సరిహద్దులు కలిగి ఉంది.

చికెన్ నెక్ అనగానే కోడి మెడ దేశానికి గుండెకాయ ఏమిటని అనుకుంటున్నారా.. అలా అనుకుంటే మీరు పొరాటు పడినట్లే. ఇది పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ఒక ప్రాంతం. ఇదే దేశానికి గుండెకాయ. 20 నుంచి 22 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ ప్రాంతమే దేశానికి ఆయువుపట్టు. ఈ ప్రాంతాన్ని ఆక్రమిస్తే భారత దేశాన్ని ఆక్రమించుకోవడం సులభమవుతుందనే ఆలోచనలో కొన్ని దేశాలు ఉన్నట్లు కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది.
2000 సంవత్సరం తర్వాత నుంచి చికెన్ నెక్ ప్రాంతం నుంచి అస్సాం, బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోకి చొరబాటుదారులు అధికంగా వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాంతం చుట్టూ అనేక అంతర్జాతీయ సరిహద్దులు ఉన్నాయి. దీంతో చికెన్ నెక్ ప్రాంతం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. బంగ్లాదేశ్ నుంచి లక్షల మంది భారత్‌కు ఇక్కడి నుంచే చొరబడ్డారని ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ గతంలో ఎన్నోసార్లు ఆరోపించింది. ఈ క్రమంలో చికెన్ నెక్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
చికెన్ నెక్ విశిష్టత
పశ్చిమబెంగాల్‌లోని సిలిగురి కారిడార్ యొక్క మరోపేరు చికెన్ నెక్. కోడి మెడ ఆకారంలో ఉండటంతో ఈ ప్రాంతానికి చికెన్ నెక్ అనే పేరు వచ్చింది. ఈ ప్రాంతంలో భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలను దేశంతో అనుసంధానించే ఒక సన్నని భూభాగం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సిలిగురి నగరం చుట్టూ ఉన్న 20 నుంచి 22 కిలోమీటర్లు ఉండే ఈ ప్రాంతం అంతర్జాతీయ సరిహద్దులు కలిగి ఉంది. చికెన్ నెక్‌కు పశ్చిమాన నేపాల్, ఉత్తరాన్న భూటాన్, దక్షిణాన బంగ్లాదేశ్, తూర్పున ఈశాన్య రాష్ట్రాలుఉన్నాయి. ఈ ప్రాంతం డార్జిలింగ్, జల్పైగురి జిల్లాల్లో విస్తరించి ఉంది. ఈ ప్రాంతం యొక్క భౌగోళిక ఆకృతి కారణంగ ఈ ప్రాంతానికి చికెన్ నెక్ అనే పేరు వచ్చింది. ఇండియా మ్యాప్‌లో ఈ సన్నని భూభాగం కోడి మెడ లాంటి ఆకారంలో కనిపిస్తుంది. బ్రిటీష్ వలస పాలన తర్వాత, 1947లో భారత విభజన సమయంలో ఈ ప్రాంతం ఏర్పడింది. బెంగాల్ విభజనతో ప్రస్తుతం బంగ్లాదేశ్‌గా పిలవబడుతునన తూర్పు పాకిస్థాన్ ఏర్పడిన తర్వాత ఈ కారిడార్ ఒక ఇరుకైన భూమార్గంగా మిగిలిపోయింది.
ఈశాన్య రాష్ట్రాలకు జీవనాడి
చికెన్ నెక్ ప్రాంతం ఈశాన్య రాష్ట్రాలకు జీవనాడిగా చెప్పుకోచ్చు. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపును దేశంతో అనుసంధానిస్తుంది. రవాణా, వాణిజ్యం, సైనిక సరఫరాలు అన్నీ ఈ మార్గం ద్వారానే జరుగుతాయి. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ సరిహద్దులతో ఉండటం వల్ల ఇది భౌగోళికంగా ప్రత్యేకమైనది. సిలిగురి నగరం వాణిజ్యం, రవాణా కేంద్రంగా ఉంది. ఇది భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్‌లతో వాణిజ్యానికి ఒక గేట్‌వేగా పనిచేస్తుంది.
ఎందుకు కీలకం
చికెన్ నెక్ భారతదేశంలో కీలకమైన ప్రాంతంగా మారడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ సన్నని కారిడార్ ఆక్రమణకు గురైతే ఈశాన్య రాష్ట్రాలు భారతదేశంతో సంబంధం కోల్పోయే ప్రమాదం ఉంది. పటిష్ట భద్రతా చర్యలు తీసుకోకపోతే చైనా సమీపంలోని చుంబి లోయ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈప్రాంతాన్ని ఆక్రమించడం సులభమవుతుంది. చైనా ఎప్పటికైనా కొన్ని దేశా సహాయంతో ఈ ప్రాంతాన్ని ఆక్రమిస్తుందనే భయం భారతీయుల్లో నెలకొందనే చర్చ జరుగుతోంది. 2017లో డోక్లాం సంక్షోభం ఈ భయాలను మరింత పెంచింది.ఈశాన్య రాష్ట్రాలకు సరుకులు, సైనిక సామాగ్రి రవాణా కోసం ఇదే ఏకైక భూ మార్గం. రైలు, రోడ్డు రవాణా ఈ కారిడార్‌పై ఆధారపడి ఉంటుంది. బంగ్లాదేశ్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం లేకపోవడం వల్ల ఇది మరింత కీలకమైంది. ఈ ప్రాంతం ద్వారా ఈశాన్య రాష్ట్రాల నుంచి డార్జిలింగ్ టీ, చెక్క, ఇతర ఉత్పత్తులు దేశంలోని ఇతర ప్రాంతాలకు చేరతాయి. ఇది ఆర్థికంగా కూడా దేశానికి జీవనాడి.
చొరబాట్లు
బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లు ప్రధాన సమస్యగా మారింది. మాదక ద్రవ్యాలు, ఆయుధాల రవాణా వంటి సమస్యలు ఈ ప్రాంతాన్ని భద్రతా దృష్ట్యా కీలకంగా చేశాయి. ఈ ప్రాంతంలో భారత సైన్యం, అస్సాం రైఫిల్స్, BSF, SSB వంటి బలగాలు పహారా కాస్తాయి. మొత్తంగా, చికెన్ నెక్ భారతదేశ భౌగోళిక సమగ్రత, ఆర్థిక స్థిరత్వం, జాతీయ భద్రతకు ఒక మూల స్తంభం. దీని సున్నితత్వం, వ్యూహాత్మక స్థానం దాన్ని దేశంలో అత్యంత ముఖ్యమైన ప్రాంతాల్లో ఒకటిగా నిలిపాయి. ప్రస్తుతం చైనా ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడంపై ఫోకస్ చేసిందనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. భారత హోం మంత్రిత్వ శాఖ 2019 నివేదిక ప్రకారం, బంగ్లాదేశ్ నుండి సుమారు 1.5 కోట్ల మంది అక్రమ వలసదారులు భారతదేశంలోకి ప్రవేశించారని అంచనా. చికెన్ నెక్ ప్రాంతానకి దక్షిణ భాగంలో ఉన్న బంగ్లాదేశ్ చొరబాట్లకు ప్రధాన ద్వారంగా మారింది. 2021లో, బీఎస్‌ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్) సిలిగురి సెక్టార్‌లో 3,500 మంది చొరబాటుదారులను అరెస్ట్ చేసింది, వీరిలో ఎక్కువ మంది బంగ్లాదేశ్ నుండి వచ్చినవారే. మయన్మార్ నుంచి రోహింగ్యా శరణార్థులు బంగ్లాదేశ్ ద్వారా చికెన్ నెక్ మీదుగా భారతదేశంలోకి ప్రవేశించారు. 2018లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ఈ చొరబాట్లు ఈశాన్య రాష్ట్రాల జనాభా సమతుల్యతను దెబ్బతీస్తున్నాయని హెచ్చరించారు. బీఎస్ఎఫ్ డేటా ప్రకారం, 2017-2019 మధ్య 4,000 మంది రోహింగ్యాలు ఈ మార్గంలో భారత్‌లోకి వచ్చారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
చైనా కుట్రలు..!
సిక్కిం సరిహద్దుకు సమీపంలోని చుంబీ లోయలో చైనా సైనిక స్థావరాలను విస్తరించింది. 2021లో సాటిలైట్ చిత్రాలు ఈ ప్రాంతంలో రోడ్లు, హెలిప్యాడ్‌లు, ఆయుధ గిడ్డంగుల నిర్మాణాన్ని వెల్లడించాయి. ఈ లోయ నుండి చికెన్ నెక్‌కు దూరం కేవలం 130 కిలోమీటర్లు కావడంతో, ఇది భారతదేశ ఈశాన్య రాష్ట్రాలను లక్ష్యంగా చేసిన వ్యూహాత్మక కదలికగా భావించబడుతోంది. భారత రక్షణ మంత్రిత్వ శాఖ 2022 నివేదికలో ఈ ప్రాంతంలో చైనా కార్యకలాపాలు ఆందోళనకరం అని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here