INDI Alliance : ‘ఇండీ’ కూటమి లేనట్లేనా?
ABN, Publish Date - Jan 10 , 2025 | 04:50 AM
బీజేపీని ఓడించడమే లక్ష్యంగా గత లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆవిర్భవించిన ‘ఇండీ’ కూటమి ఉనికి ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. ఒక్కో భాగస్వామ్య పార్టీ ఒక్కో తీరుగా వ్యవహరిస్తోంది. లోక్‌సభ ఎన్నికల వరకే ఈ కూటమి పరిమితమైతే.. దానిని మూసివేయడం మంచిదని జమ్మూకశ్మీరు సీఎం,
కాంగ్రెస్‌కు ‘చేయి’స్తున్న మిత్రపక్షాలు
ఢిల్లీ ఎన్నికల్లో ‘ఆప్’కు మద్దతిస్తున్నసమాజ్‌వాదీ, టీఎంసీ, ఉద్ధవ్ సేన
కూటమిని మూసేయాలన్న ఒమర్ అబ్దుల్లా
న్యూఢిల్లీ, జనవరి 9: బీజేపీని ఓడించడమే లక్ష్యంగా గత లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆవిర్భవించిన ‘ఇండీ’ కూటమి ఉనికి ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. ఒక్కో భాగస్వామ్య పార్టీ ఒక్కో తీరుగా వ్యవహరిస్తోంది. లోక్‌సభ ఎన్నికల వరకే ఈ కూటమి పరిమితమైతే.. దానిని మూసివేయడం మంచిదని జమ్మూకశ్మీరు సీఎం, ఎన్‌సీ సీనియర్ నేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. కూటమి నాయకత్వం, భావి వ్యూహాలకు సంబంధించిన ఎజెండాపై స్పష్టత లేకుండా పోయిందని ఆక్షేపించారు. భాగస్వామ్య పక్షాలైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వేటికవి బరిలోకి దిగడం.. పరస్పరం విమర్శలు చేసుకుంటుండడం.. సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్, టీఎంసీ, ఉద్ధవ్ శివసేన బహిరంగంగానే ఆప్‌కు మద్దతు ప్రకటించడం.. వారికి ‘ఎక్స్’ వేదికగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ధన్యవాదాలు తెలియజేయడం తెలిసిందే. ఇండీ కూటమి లోక్‌సభ ఎన్నికలవరకే పరిమితమని బిహార్‌లో ఆర్‌జేడీ యువనేత, మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కొద్దిరోజుల కిందట అనడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Updated Date - Jan 10 , 2025 | 04:50 AM