India Defense: సైన్యం మరింత శక్తిమంతం!
ABN, Publish Date - Mar 21 , 2025 | 04:54 AM
ఇందులో భాగంగా రూ.54 వేల కోట్లతో భారీఎత్తున మిలటరీ హార్డ్‌వేర్ పరికరాలను కొనుగోలు చేసేందుకు గురువారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) సమావేశం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ‘

54 వేల కోట్లతో మిలటరీ హార్డ్‌వేర్ కొనుగోలుకు డీఏసీ ఓకే
న్యూఢిల్లీ, మార్చి 20: భారత సైన్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు, యుద్ధ సామర్థ్యాన్ని ఆధునీకరిచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రూ.54 వేల కోట్లతో భారీఎత్తున మిలటరీ హార్డ్‌వేర్ పరికరాలను కొనుగోలు చేసేందుకు గురువారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) సమావేశం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ‘ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్’ వ్యవస్థలు, టార్పెడోలు, టీ-90 ట్యాంకుల కోసం ఇంజన్లు వంటివి కొనుగోలు చేయనున్నారు. మరోవైపు భారీఎత్తున దేశీయంగా తయారు చేసిన ఆర్టిలరీ శతఘ్నుల కొనుగోలుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఆర్మీ కోసం అడ్వాన్స్‌డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్స్ (ఏటీఏజీఎస్) కొనుగోలుకు సంబంధించి రూ.7 వేల కోట్ల ఒప్పందానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ కమిటీ (భద్రత) ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా 307 హోవిట్జర్లను కొనుగోలు చేయనున్నారు. అదేవిధంగా సైన్యంలోని 15 ఆర్టిలరీ రెజిమెంట్లకు ఆయుధాలు సమకూర్చేందుకు 327 శతఘ్నులను తీసుకెళ్లే వాహనాలు (గన్ టోయింగ్ వెహికల్స్) కొనుగోలు చేస్తారు. 155ఎంఎం/52 క్యాలిబర్ ‘ఏటీఏజీఎస్’ను డీఆర్‌డీవో అభివృద్ధి చేయగా.. భారత్ పోర్జ్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సంస్థలు ఉత్పత్తి చేయనున్నాయి. బిడ్డింగ్‌లో భారత్ పోర్జ్ ఎల్-1గా నిలిచిన నేపథ్యంలో.. ఆ సంస్థ 60 శాతం శతఘ్నులను, టాటా సంస్థ మిగతా 40 శాతం తయారు చేయనుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: వీళ్లను ఎవ్వరూ కాపాడలేరు.. ఓ యువతి రైల్వే స్టేషన్‌లో అందరి ముందు ఏం చేసిందో చూడండి..
Updated Date - Mar 21 , 2025 | 04:54 AM