Jaya Bachchan: జయా బచ్చన్‌ని ట్రోల్ చేస్తోన్న ఫ్యాన్స్.. ఇంత పొగరు పనికి రాదంటూ
ABN, Publish Date - Apr 07 , 2025 | 11:13 AM
ఒకప్పటి బాలీవుడ్ టాప్ హీరోయిన్, బిగ్ బీ భార్య జయా బచ్చన్ తీరుపై అప్పుడప్పుడు విమర్శలు వస్తుంటాయి. మరీ ముఖ్యంగా అభిమానులు, పాపారాజీలతో ఆమె దురుసుగా ప్రవర్తిస్తారని జనాల్లో పాతుకుపోయింది. జయా బచ్చన్ తీరుపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆమె మాత్రం తన పద్దతి మార్చుకోరు. తాజాగా మరోసారి తన దురుసుతనంతో వార్తల్లో నిలిచారు జయా బచ్చన్. ఆ వివరాలు..

ముంబై: మన దేశంలో సినీ, రాజకీయ, క్రీడా రంగాల్లోని వారికి భారీ ఎత్తున అభిమానులుంటారు. ఇక వారిని చూడటం కోసం ఫ్యాన్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. సెలబ్రిటీలు బయట కనపడితే చాలు.. పరిస్థితి, ప్రాంతంతో సంబంధం లేకుండా వారితో సెల్ఫీల కోసం ఎగబడతారు. ఫ్యాన్స్ తీరు వల్ల ఇబ్బందిగా అనిపించినా సరే.. చాలా మంది సెలబ్రిటీలు నవ్వుతూ ముందుకు వెళ్తారు. కానీ కొందరు సెలబ్రిటీలు మాత్రం అభిమానులతో దురుసుగా వ్యవహరిస్తారు. వారిని కొట్టడానికి చెయ్యి కూడా లేపుతారు.
ఫ్యాన్స్‌తో ఇలా దురుసుగా ప్రవర్తించే వారిలో బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు జయా బచ్చన్ ముందు వరుసలో ఉంటారు. గతంలో అనేక సార్లు అభిమానులతో దురుసుగా ప్రవర్తించగా.. తాజాగా మరోసారి తన దూకుడు స్వభావంతో మరోసారి వార్తల్లో నిలిచారు జయా బచ్చన్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వివరాలు..
బాలీవుడ్ ప్రముఖ నటుడు మనోజ్ కుమార్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ప్రార్థనా సమావేశం నిర్వహించారు. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ ప్రార్థనా సమావేశాలకు హాజరయ్యారు. వీరిలో జయా బచ్చన్ కూడా ఉన్నారు.
సెలబ్రిటీలతో పాటు మనోజ్ కుమార్ బంధువులు కూడా ఈ ప్రార్థనా సమావేశాలకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఓ మధ్యవయసు మహిళ జయా బచ్చన్‌తో ఫొటో దిగాలని ఆశించి.. ఆమెను పిలిచింది. ఫొటో ఇవ్వమని కోరింది. మధ్య వయసు దంపతులు అంత మర్యాదగా రిక్వెస్ట్ చేసినా సరే జయాబచ్చన్ మాత్రం వారితో చాలా అమర్యాదగా ప్రవర్తించారు. సదరు మహిళ చేయి పట్టుకుని విసిరి కొట్టారు. దాంతో ఆ దంపతులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే తేరుకుని జయాబచ్చన్‌కు క్షమాపణలు చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ తతంగం మొత్తాన్ని కొందరు వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
వీడియో కాస్త వైరల్ కావడంతో.. నెటిజనులు జయా బచ్చన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ మహిళ అక్కడ ఫొటో దిగమని కోరడం తప్పే.. కానీ జయాబచ్చన్ అంత దురుసుగా ప్రవర్తించడం మాత్రం సరికాదు. వారు ఎంత మర్యాదగా రిక్వెస్ట్ చేశారు. ఆమె కూడా అలానే స్పందిస్తే బాగుండేది. కానీ ఆమె చాలా పొగరుగా ప్రవర్తించారు. ఇలాంటి వారు బహిరంగప్రదేశాల్లో తిరగడానికి అనర్హులు. తన ప్రవర్తన పట్ల జయా బచ్చన్ సిగ్గుపడాలి అంటూ ట్రోల్ చేస్తున్నారు.
అయితే కొందరు అభిమానులు మాత్రం జయాబచ్చన్ తీరును సమర్థిస్తున్నారు. చనిపోయిన వ్యక్తిని చూడ్డానికి వెళ్లిన చోట ఫొటోలు దిగడం ఏంటి అసహ్యంగా. అలా కోరడం చాలా తప్పు. అందుకే జయాబచ్చన్ అలా రియాక్ట్ అయ్యారు. దానిలో ఆమె తప్పు ఎంత మాత్రం లేదని కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Crime News: శంకరయ్య హత్య కేసు మిస్టరీని చేధించిన పోలీసులు..
మానవత్వం అంటే ఇది.. పాక్ సిబ్బందికి ఇండియన్ నేవీ సాయం
Updated Date - Apr 07 , 2025 | 11:20 AM