Jharkhand Goods Train Accident: ఝార్ఖండ్‌లో రైలు ప్రమాదం.. లోకోపైలట్‌ల దుర్మరణం
ABN , Publish Date - Apr 01 , 2025 | 10:11 AM
ఝార్ఖండ్‌లో తాజాగా రైలు ప్రమాదం సంభవించింది. నిలిపి ఉంచిన గూడ్స్ రైలును మరో గూడ్స్ రైలు ఢీకొనడంతో ఇద్దరు లోకో పైలట్లు దుర్మరణం చెందారు.

ఇంటర్నెట్ డెస్క్: ఝార్ఖండ్‌లోని సాహిబ్ గంజ్ జిల్లాలో తాజాగా ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. నిలిపి ఉంచిన గూడ్స్ రైలును మరో గూడ్స్ రైలు వేగంగా ఢీకొనడంతో ఇద్దరు లోకోపైలట్‌లు సహా ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో ఐదుగురు రైల్వే వర్కర్లతో పాటు ఓ సీఆర్‌పీఎఫ్ జవాన్ కూడా మృతి చెందినట్టు తెలిసింది. గాయపడ్డ వారికి బార్‌హైత్ కమ్యూనిటీ కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు.
Also Read: వేతనజీవులకు పన్ను ఉపశమనం
బార్‌హెయిట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫరక్కా-లాల్‌మాటియా రైల్వే లైన్‌పై మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. బార్‌హెయిట్ ఎమ్‌టీ వద్ద నిలిపి ఉంచిన ఓ ఖాళీ గూడ్స్ రైలును బొగ్గు రవాణా చేస్తున్న మరో గూడ్స్ రైలు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. పరిస్థితిని సమీక్షించేందుకు ఘటనా స్థలానికి నిపుణులు బృందాన్ని పంపించారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.