Justice Yashwant Varma: రహస్యంగా జస్టిస్ యశ్వంత్ వర్మ ప్రమాణం
ABN, Publish Date - Apr 07 , 2025 | 04:32 AM
ఇంట్లో నోట్లకట్టలు బయటపడిన ఆరోపణల మధ్య జస్టిస్ యశ్వంత్ వర్మ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా రహస్యంగా ప్రమాణం చేశారు. ఈ చర్యను అలహాబాద్ బార్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకించి రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: ఇంట్లో నోట్లకట్టలు బయటపడిన వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ.. శనివారం అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. పెద్దగా అతిథులెవరూ లేకుండా ఆయన చాంబర్‌లోనే ఈ కార్యక్రమం రహస్యంగా జరగటం గమనార్హం. దీనిని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. జస్టిస్ వర్మను చేర్చుకోవద్దని తాము హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞాపనపత్రం ఇచ్చినప్పుడు.. తగిన చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారని అసోసియేషన్ కార్యదర్శి విక్రాంత్ పాండే తెలిపారు. అయినప్పటికీ, తమ సంఘంతోపాటు పలువురు జడ్జిలకు కూడా సమాచారం ఇవ్వకుండా సదరు ‘ప్రమాణం’ జరిపారన్నారు. రహస్య ప్రమాణం అనేది రాజ్యాంగ విరుద్ధమని, వర్మకు విధులు అప్పగించవద్దని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
జెలెన్‌స్కీ సొంత నగరంపై రష్యా దాడి
Read Latest and International News
Updated Date - Apr 07 , 2025 | 04:33 AM