Share News

Karnataka: కర్ణాటకలో పట్టపగలే బ్యాంకు దోపిడీ

ABN , Publish Date - Jan 18 , 2025 | 05:54 AM

కర్ణాటకలోని బీదర్‌లో సెక్యూరిటీ వాహనంపై కాల్పులు జరిపి, ఏటీఎంలో పెట్టాల్సిన రూ.93 లక్షలను దోచుకువెళ్లిన మరుసటి రోజే.. దుండగులు మంగళూరు సమీపంలో ఏకంగా బ్యాంకును దోచుకోవడం కలకలం రేపుతోంది.

 Karnataka: కర్ణాటకలో పట్టపగలే బ్యాంకు దోపిడీ

ఆయుధాలతో వచ్చి.. ఖాతాదారులనూ బెదిరించి..

తుపాకీ గురిపెట్టి రూ.10 కోట్లకు పైగా అపహరణ

పోలీసులు ఏం చేస్తున్నారు?: సీఎం సీరియస్‌

బెంగళూరు, జ నవరి 17(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలోని బీదర్‌లో సెక్యూరిటీ వాహనంపై కాల్పులు జరిపి, ఏటీఎంలో పెట్టాల్సిన రూ.93 లక్షలను దోచుకువెళ్లిన మరుసటి రోజే.. దుండగులు మంగళూరు సమీపంలో ఏకంగా బ్యాంకును దోచుకోవడం కలకలం రేపుతోంది. దక్షిణ కన్నడ జిల్లా ఉళ్లాల తాలూకా కేసీ రోడ్డులోని కోటెకారు వ్యవసాయ సేవా సహకార సంఘం(వీఎ్‌సఎస్‌) బ్యాం కులో శుక్రవారం మధ్యాహ్నం మరో భారీ చోరీ జరిగిం ది. ఆయుధాలతో వచ్చిన దుండగు లు బ్యాంకులో ఉన్న రూ.10 కోట్ల కు పైగా నగదు, ఆభరణాలను దో చుకుపోయారు. ఐదుగురు దొంగలు ఫియట్‌కారులో వచ్చి బ్యాంకులోకి ప్రవేశించారు. తుపాకులు, తల్వార్‌లతో ఖాతాదారులు, ఉద్యోగులను బెదిరించారు. క్యాషియర్‌ వద్ద ఉన్న నగదును తీసుకున్నారు. సేఫ్‌ రూం నుంచి అప్పుడే బయటకు వచ్చిన మేనేజర్‌కు తూపాకీ గురిపెట్టి, సేఫ్‌ రూమ్‌ను తెరిపించారు. లాకర్లలోని నగదు, బంగారు ఆభరణాలను దోచుకుని వచ్చిన కారులో పరారయ్యారు. తమను వెంబడిస్తే కాల్చివేస్తామని హెచ్చరించారు. విషయం తెలియగానే పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. కేవలం పది నిమిషాల వ్యవధిలో దోపిడీ చేశారని బ్యాంకు ఉద్యోగి రామచంద్ర తెలిపారు. దోపిడీకి వచ్చినవారు 30 ఏళ్లలోపు వారేనని, హిందీలో మాట్లాడారని తెలిపారు. కాగా, బ్యాంకు దోపిడీపై సీఎం సిద్దరామయ్య తీవ్రంగా మండిపడ్డారు. పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Jan 18 , 2025 | 05:54 AM