Errol Musk : నా కొడుకు మాట పట్టించుకోవద్దు
ABN, Publish Date - Jan 09 , 2025 | 05:39 AM
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇతర దేశాల రాజకీయాల్లో జోక్యం చేసుకోవడంపై తప్పుపడుతూ ఆయన తండ్రి ఎర్రల్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు, ట్వీట్లను పట్టించుకోవద్దని
అతడో మామూలు మనిషి
ఎలాన్ మస్క్ తండ్రి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, జనవరి 8: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇతర దేశాల రాజకీయాల్లో జోక్యం చేసుకోవడంపై తప్పుపడుతూ ఆయన తండ్రి ఎర్రల్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు, ట్వీట్లను పట్టించుకోవద్దని పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. ‘‘ఎలాన్ చెప్పిన మాటలను ప్రజలు వినిపించుకోవద్దు. అతడో మామూలు మనిషి. ఎలాన్ మస్క్ వద్ద బాగా డబ్బు ఉంది కాబట్టి అతడు చెప్పిన విషయాలను చాలా మంది రీట్వీట్ చేస్తారు. నేనైతే అలా చేయను’’ అని ఎర్రల్ పేర్కొన్నారు. ఎలాన్ మస్క్ ఆయన తండ్రి ఎర్రల్ మస్క్ మధ్య తీవ్రమైన అభిప్రాయభేదాలున్నాయి.
Updated Date - Jan 09 , 2025 | 05:39 AM